Patanjali: మార్కెట్ నుంచి ‘పతంజలి’ కారం వెనక్కి..
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:24 AM
యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆహార భద్రతా, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఆదేశాలతో మార్కెట్ నుంచి 4 టన్నుల కారం పొడిని వెనక్కు తీసుకుంది.

పురుగు పట్టకుండా వాడే మందు పరిమితికి మించడంతో 4 టన్నుల ఉత్పత్తి ఉపసంహరణ
న్యూఢిల్లీ, జనవరి 24: యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆహార భద్రతా, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఆదేశాలతో మార్కెట్ నుంచి 4 టన్నుల కారం పొడిని వెనక్కు తీసుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో ఓ బ్యాచ్‌కు చెందిన 200 గ్రాముల కారం పొడి ప్యాకెట్లను వెనక్కి తీసుకోవాలని పతంజలి సంస్థకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నిర్దేశించింది. దీనిపై పతంజలి సంస్థ సీఈవో సంజీవ్ ఆస్థానా ప్రకటన విడుదల చేశారు. ‘మా ఉత్పత్తి నమూనాలను పరీక్షించినప్పుడు కారానికి పురుగు పట్టకుండా వాడే మందును పరిమితికి మించి వినియోగించినట్లు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ గుర్తించింది. దీంతో మార్కెట్ నుంచి 200 గ్రాముల కారం పొడి ప్యాకెట్లను వెనక్కి తీసుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాం. మా సరఫరాదారుల్ని సంప్రదించి సదరు బ్యాచ్‌కు సంబంధించిన కారం పొడి ప్యాకెట్లను వెనక్కి పంపించాలని కోరాం. ఇప్పటికే ఆ ప్యాకెట్లను ఎవరైనా కొనుగోలు చేస్తే.. వాటిని తిరిగిచ్చి డబ్బులు తీసుకోవాలని ప్రకటనలు కూడా ఇచ్చాం. మా ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదు’ అని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News