RG Kar Case: కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చు.. బాధితురాలి తల్లిదండ్రులకు సుప్రీం అనుమతి
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:56 PM
మెడికో హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జనవరి 20న సీల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే మరికొందరి పాత్రను నిర్దారించేందుకు సీబీఐ మరింత లోతైన దర్యాప్తు జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజే (RG Kar Medical Colleg)లో అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సీబీఐని ఆదేశించాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం విచారించింది. దీనిపై దర్యాప్తు చేయించాలని కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సీజేఐ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ దశలో తిరిగి దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించలేమని పేర్కొంది. బాధితురాలి కుటుంస సభ్యుల తరఫున సీనియర్ అడ్వకేట్ కరుణ నుండి హాజరుకాగా, సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.
Viral Video: వడోదర కారు ప్రమాదంలో నిందితుడు డ్రైవింగ్ చేయలేదా..బాటిల్ వీడియో వైరల్
మెడికో హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జనవరి 20న సీల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే మరికొందరి పాత్రను నిర్దారించేందుకు సీబీఐ మరింత లోతైన దర్యాప్తు జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈమేరకు సీబీఐను ఆదేశించాల్సిందిగా వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ తరఫు న్యాయవాది వాదన విన్న అనంతరం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించడం సముచితమని సుప్రీం ధర్మాసనం భావించింది.
న్యాయం కోరుతూ కోల్‌కతాలో ర్యాలీలు
కాగా, హత్యాచార బాధితురాలి న్యాయం జరగాలని కోరుతూ ఈనెల మొదట్లో రెండు ర్యాలీలు కోల్‌కతాలో జరిగాయి. హత్యాచార ఘటన జరిగిన ఏడు నెలలైన సందర్భంగా ఈ ఘటనను ఖండిస్తూ పౌర సమాజాలు ర్యాలీలు చేపట్టారు. మార్చి 1న విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు వాహనం ఢీకొనడంతో జాదవ్‌పూర్ క్యంపస్ స్టూడెంట్ గాయపడిన ఘటనపై కూడా వీరు నిరసన తెలిపారు. ఆర్జీ కర్ మెడికో హత్యాచార ఘటనలో నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంజీవ్ రాయ్‌కు జీవితాంతం జైలులోనే ఉండాలని సీల్డా కోర్టు శిక్ష విధించగా, ఈ నేరంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరో ముగ్గురి ప్రమేయం ఉందని, వారిని కూడా అరెస్టు చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తు్న్నారు. తొలుత ఈ కేసుపై కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆ తర్వాత కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.
ఇవి కూడా చదవండి..