RRTS: మూడు మార్గాల్లో ఆర్‌ఆర్‌టీఎస్ సేవలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:10 PM
నగరంలో మొత్తం మూడు మార్గాల్లో హై స్పీడ్ రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ మార్గాల్లో రైళ్ల రాకపోకలకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతున్నారు. ఈ రైళ్లు గనుక అందుబాటులోకి వస్తే.. నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశముంది.

- సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారీకి టెండర్ల ఆహ్వానం
చెన్నై: రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా, గంటకు 160 కి.మీ హైస్పీడ్(High speed)తో పరుగులు తీసే రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ (ఆర్‌ఆర్‌టీఎస్) మార్గాల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేసేందుకు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) టెండర్లు ఆహ్వానించింది. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఈ నెల 14న ఆర్ధిక మంత్రి తంగం తెన్నరసు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. విస్తృతమైన పట్టణీకరణ పరిగణలోకి తీసుకొని అతి వేగంతో కూడిన రైలు రవాణా అభివృద్ధి చేసేలా సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ వార్తను కూడా చదవండి: Vijay: ఇక విజయ్ ఒంటరేనా.. అమిత్‌షా-ఈపీఎస్ భేటీతో డైలమాలో ‘టీవీకే’
ఆ ప్రకారం, చెన్నై-దిండివనం-విల్లుపురం, చెన్నై-కాంచీపురం-వేలూరు(Chennai-Kanchipuram-Veluru), కోయంబత్తూర్-తిరుప్పూర్-ఈరోడ్-సేలం తదితర మూడు మార్గాల్లో సీఎంఆర్‌ఎల్ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆర్‌ఆర్‌టీఎస్ రైలు రవాణా సేవల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నివేదిక అందించే సంస్థ ఎంపికకు సీఎంఆర్‌ఎల్ టెండర్లు ఆహ్వానించింది.
చెన్నై-చెంగల్పట్టు మీదుగా దిండివనం వరకు 160 కి.మీ వేగంతో ఆర్‌ఆర్‌టీఎస్ రైలు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే, చెన్నై-కాంచీపురం మార్గంగా వేలూరుకు 160 కి.మీ వేగంతో, కోవై నుంచి తిరుప్పూర్, ఈరోడ్ మీదుగా సేలంకు హైస్పీడ్ రైళ్లు నడుపనున్నారు. కాగా, గంటకు అధికంగా 160 కి.మీ వేగంతో వెళ్లేలా ఆర్‌ఆర్‌టీఎస్ రవాణా ఢిల్లీ-మీరట్ మధ్య అందుబాటులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు
Read Latest Telangana News and National News