RTC bus: అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 20 , 2025 | 07:11 AM
ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలో జరిగింది. అయితే ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- ఆర్టీసీ బస్సులో మంటలు
- త్రుటిలో తప్పించుకున్న ప్రయాణికులు
బెంగళూరు: బీదర్(Bidar) జిల్లా ఔరాద్కర్ తాలూకా కప్పకేరి వద్ద బుధవారం కల్యాణ కర్ణాటక ఆర్టీసీ బస్సు(Kalyana Karnataka RTC Bus)లో మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఔరాద్కర్ డిపోకు చెందిన బస్సు బీదర్ నుంచి వస్తుండగా కప్పకేరి వద్ద ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. అంతలోనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేశారు. ప్రయాణీకులందరినీ కిందకు దిగాలని సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: క్షేమంగా పుడమికి
ఇంజన్‌లో చెలరేగిన మంటలు కొద్దిసమయంలోనే బస్సు పూర్తిగా వ్యాపించాయి. 25మంది ప్రయాణీకులు బస్సునుంచి కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ఇంజన్(Fire engine)లతో వచ్చి మంటలను పూర్తిగా నియంత్రించారు. అయితే బస్సు పూర్తిగా కాలిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ: కవిత
ధరలు పెంచితేనే లక్ష్యాన్ని చేరేది!