Ranveer Allahbadia: రెండు వారాల తర్వాతే.. అల్హాబాదియా పాస్‌పోర్ట్ రిలీజ్‌పై సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:11 PM
విచారణ సందర్భంగా అల్హాబాదియా తరఫు న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ తన వాదన వినిపిస్తూ, పాస్‌పోస్ట్ డిపాజిట్‌తో తన క్లయింట్ జీవనోపాధిపై ప్రభావం పడుతోందని, పాస్ పోర్ట్ డిపాజిట్‌కు విధించిన షరతులను సవరించాలని కోర్టును కోరారు.

న్యూఢిల్లీ: 'ఇండియాస్ గాట్ లేటెండ్' వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahabadia)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో నిరాశ ఎదురైంది. కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ ఆయన పాస్‌పోర్ట్‌ను రిలీజ్ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారంనాడు నిరాకరించింది. అయితే రెండు వారాల తర్వాత ఆయన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపింది. దీనికి ముందు, మరో రెండు వారాల్లో కేసు విచారణ పూర్తయ్యే అవకాశం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు.
Pryagraj Demolitions: ప్రయాగ్‌రాజ్ బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం ఆగ్రహం.. నష్టపరిహారానికి ఆదేశం
విచారణ సందర్భంగా అల్హాబాదియా తరఫు న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ తన వాదన వినిపిస్తూ, పాస్‌పోస్ట్ డిపాజిట్‌తో తన క్లయింట్ జీవనోపాధిపై ప్రభావం పడుతోందని, పాస్ పోర్ట్ డిపాజిట్‌కు విధించిన షరతులను సవరించాలని కోర్టును కోరారు. తన షోలలో క్రమశిక్షణ పాటిస్తానని అల్హాబాదియా ఇచ్చిన అండర్‌టేకింగ్‌ను కూడా కోర్టుకు సమర్పించినట్టు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, అల్హాబాదియా విదేశాలకు వెళ్తే విచారణకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది. ఎంత గడువులోగా దర్యాప్తు పూర్తవుతుందో చెప్పాలని మహారాష్ట్ర, అసోం ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. దీనిపై తాను ఎలాంటి సమాచారం కోరలేదని, అయితే మరో రెండో వారాల్లో విచారణ పూర్తికావచ్చని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితులున్నాయని, అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మార్చి 3న జరిగిన విచారణలో అల్హాబాదియాను సుప్రీంకోర్టు మందలించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ అరెస్టు నుంచి ఆయనకు రక్షణ కల్పిస్తూ.. గువాహటిలో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పాడ్‌కాస్ట్ ప్రసారాలను పునఃప్రారంభించేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..