Viral Video: పిల్లల ముందే పొట్టుపొట్టు కొట్టుకున్న టీచర్లు
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:48 PM
ఆ ఇద్దరూ లేడీ టీచర్లు నేలపై పడి కొట్టుకుంటూ ఉన్నారు. అంగన్‌వాడీ టీచర్ తమ టీచర్‌ను కొట్టడం అక్కడి పిల్లలకు నచ్చలేదు. వాళ్లు అంగన్‌వాడీ టీచర్‌పై దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పుతున్నారు. పిల్లల ముందే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ ఇద్దరు లేడీ టీచర్లు పిల్లల ముందే దారుణంగా కొట్టుకున్నారు. నేలపై పడి జట్లుపట్టుకుని కుమ్ముకున్నారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఓ ప్రైమరీ స్కూలు ఉంది. ప్రీతీ తివారీ అనే అమ్మాయి అందులో అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తోంది. బుధవారం ప్రీతికి.. అంగన్‌వాడీ టీచర్ చంద్రావతికి మధ్య వాగ్వివాదం జరిగింది. అది కాస్తా కొద్దిసేపటికే పెద్ద గొడవలాగా మారింది. ఇద్దరూ కలబడికుమ్ముకోవటం మొదలెట్టారు.
నేలపై పడి పోయారు. కింద నేలపై చంద్రావతి.. ఆమెపై ప్రీతీ ఉన్నారు. ఇద్దరూ ఒకరి జట్టు ఒకరు పట్టుకుని లాక్కుంటూ ఉన్నారు. అంగన్‌వాడీ టీచర్ తమ టీచర్‌ను కొట్టడం కొంతమంది విద్యార్థులకు నచ్చలేదు. చంద్రావతిపై దాడి చేశారు. వాళ్ల గొడవ చూసి అక్కడ పని చేస్తున్న మిగితా టీచర్లు విడిపించడానికి ప్రయత్నించారు. అయినా వాళ్లు పక్కకు రాలేదు. బలవంతంగా ఇద్దర్నీ పక్కకు లాగారు. అంగన్‌వాడీ టీచర్‌కు బాగా గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఫరీదాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై ఉన్నతాధికారులు స్పందించారు. విచారణకు ఆదేశించారు.
విచారణలో ఏం తేలిందంటే..
ప్రాధమిక దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే.. అసిస్టెంట్ టీచర్ ప్రీతీ తివారి.. చంద్రావతితో గొడవ పెట్టుకుంది. తనే చంద్రావతిపై దాడికి యత్నించింది. ప్రీతీ తివారీ ఇలా గొడవలు పెట్టుకోవటం ఇదేం మొదటి సారి కాదు. గతంలోనూ చాలా సార్లు.. చాలా మందితో గొడవలు పెట్టుకుంది. ఆమెపై చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఈ సారి ప్రీతీ కారణంగా చంద్రావతి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. విద్యాధికారులు ప్రీతిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం వెళ్లలేదు. ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. కేసు పెడితే.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Viral Video: స్విమ్మింగ్‌పూల్లో అలజడి.. గజ గజ వణికిన ప్రేమ జంట
Iftar: దుబాయిలో రంజాన్ చివరి రోజు ప్రవాసాంధ్రుల ఇఫ్తార్