Viral News: ప్రముఖ గాయకుడిపై రాళ్లు, సీసాలతో దాడి..స్పందించిన సింగర్
ABN , Publish Date - Mar 25 , 2025 | 07:58 PM
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU) ఇంజిఫెస్ట్ 2025లో ప్రదర్శన సమయంలో బాలీవుడ్ సింగర్ సోను నిగమ్‌పై పలువురు రాళ్లు, సీసాలను విసిరేశారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకోగా, ఆయన దీనిపై స్పందించారు.

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇటీవల జరిగిన ఇంజిఫెస్ట్ 2025 ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాడేందుకు వచ్చిన ప్రముఖ సింగర్ సోను నిగమ్(Sonu Nigam)పై అనేక మంది విద్యార్థులు రాళ్ళు, సీసాలను విసిరేశారు. లైవ్ షో సమయంలోనే విద్యార్థులు ఇలా చేయడంతో సింగర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సోను చాలా ప్రశాంతంగా కనిపించారు. విద్యార్థులు గౌరవంగా ప్రవర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనమందరం మంచి సమయం గడపాలని, నేను మీ కోసం ఇక్కడికి వచ్చినట్లు సోను అన్నారు. ఆనందించాలని, కానీ దయచేసి ఇలా చేయకూడదని సోను ప్రేక్షకులను కోరాడు.
సోషల్ మీడియాలో వైరల్
ఆ క్రమంలో సోను జట్టు సభ్యుల్లో కొందరు గాయపడటంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా హాజరయ్యారు. ఈ కారణంగా జనసమూహాన్ని నిర్వహించడం చాలా కష్టమైందని తెలుస్తోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే కొంత మంది మాత్రం సోను నిగమ్ ప్రదర్శనను ఆస్వాదించారు. ఆందోళన జరిగినప్పటికీ సోను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సోను నిగమ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాట పాడుతున్నప్పుడు
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా సోను విషయంలో ఇలాంటిదే జరిగింది. ఆయన కోల్‌కతాలో ప్రదర్శన ఇస్తున్న క్రమంలో ప్రేక్షకులు అక్కడి వాతావరణాన్ని చెడగొట్టారు. జనసమూహాన్ని నియంత్రించడానికి సోను నిగమ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన పాట పాడుతున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ప్రేక్షకులు లేచి నిలబడ్డారు. అది అయనకు కోపం తెప్పించింది. ప్రజలు నిలబడాలనుకుంటే ఎన్నికలకు వెళ్లాలని ఆయన కోపంగా అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News