Share News

Shashi Tharoor: ప్రధానిపై ప్రశంసలు.. వివరణ ఇచ్చిన ఎంపీ శశి థరూర్

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:45 PM

ట్రంప్‌తో భేటీ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఎంపీ శశి థరూర్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో థరూర్ వివరణ ఇచ్చారు. జాతీ ప్రయోజనాల దృష్ట్యా ఓ ఎంపీగా తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు.

Shashi Tharoor: ప్రధానిపై ప్రశంసలు.. వివరణ ఇచ్చిన ఎంపీ శశి థరూర్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని భేటీపై స్పందించిన తిరువనంతరపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఇది సంచలనంగా మారడంతో థరూర్ శనివారం వివరణ ఇచ్చారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా తాను ప్రధానిని ప్రశించానని అన్నారు.

‘‘ట్రంప్‌తో ప్రధాని భేటీతో భారతీయులకు పలు ప్రయోజనాలు చేకూరాయి. నా దృష్టిలో దేశానికి కొంత మంచి జరిగింది. ఓ భారతీయుడిగా నేను ప్రశంసించారు. ఆ సందర్భంలో నేను కేవలం భారత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్పందించాను. ప్రతిసారీ మనం పార్టీ ప్రయోజనాల కోణంలో మాట్లాడలేము కదా. నేనేమీ పార్టీ అధికార ప్రతినిధిని కారు. తిరువనంతపురం ప్రజలను ప్రతినిధిగా ఎన్నికైన ఎంపీని. ఓ ఎంపీగా నేను మాట్లాడతాను’’ అని అన్నారు.


Jayalalitha Assets: అమ్మ ఆస్తులు.. పూర్తయిన అప్పగింతలు

ట్రంప్‌తో ప్రధాని భేటీపై ఆయన స్పందిస్తూ ఇది సానుకూల పరిణామనని అన్నారు. ‘‘ఈ భేటీతో మంచే జరిగింది. లేకపోతే అమెరికా తీసుకునే చర్యలతో మన ఎగుమతులపై ప్రభావం పడి ఉండేది. ఈ భేటీ తరువాత వాణిజ్యంపై కూలంకషంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం చిక్కింది’’ అని థరూర్ ఇటీవల అన్నారు. మంచి పరిపాలనను గుర్తించి ప్రశంసించడమే తన రాజకీయ విధానమని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఎవరున్నా ఇదే తన విధానమని స్పష్టం చేశారు.


US Deportation: భారత వలసదారులతో స్వదేశానికి వచ్చిన మూడో అమెరికా విమానం

‘‘అధికారంలో కాంగ్రెస్ ఉన్నా మరో పార్టీ ఉన్నా మంచి చేస్తే ప్రశంసించాలి. ఆ ప్రయత్నాన్ని గుర్తించాలి. చెడు చేసినప్పుడు విమర్శించాలి. నేను రెండూ చేశా. నా అభిప్రాయం వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. ఇదే సరైన విధానం’’ అని శశిథరూర్ అన్నారు. అయితే, వలసదారుల తరలింపు అంశం మాత్రం ఇంకా అపరిషృతంగా మిగిలిపోయిందని అన్నారు. ‘‘ఈ అంశాన్ని ప్రధాని నాలుగు గోడల మధ్య చర్చించారేమో తెలీదు. దౌత్య చర్చల్లో ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తేలేము. అయితే, ప్రభుత్వం చేసేదంతా తప్పని ప్రతిపక్షం భావించినప్పుడు, లేదా ప్రతిపక్షం ప్రతిసారీ తప్పు చేస్తుందని అధికార పక్షం భావించినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇచ్చుపుచ్చుకోవడం ఎంతో అవసరం’’ అని అభిప్రాయపడ్డారు.

Delhi CM: ఢిల్లీ కొత్త సీఎంపై నిరీక్షణకు తెర.. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఫిక్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2025 | 11:45 PM