Home » Shashi Tharoor
శశిథరూర్ ఇటీవల సొంత పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేసిన పలు సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ఇటీవల ప్రశంసించారు.
ప్రపంచానికి శాంతి అనేది చాలా కీలకమని, యుద్ధరంగంలో శాంతి సాధ్యం కాదని నరేంద్ర మోదీ అనేవారని, చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతిని తీసుకువచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందని శశిథరూర్ అన్నారు.
శశిథరూర్ ఇటీవల ఒక ఆర్టికల్లో కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధానమంత్రి అమెరికా పర్యటనపై సైతం ప్రశంసలు కురిపించారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది.
ట్రంప్తో భేటీ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఎంపీ శశి థరూర్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో థరూర్ వివరణ ఇచ్చారు. జాతీ ప్రయోజనాల దృష్ట్యా ఓ ఎంపీగా తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శివలింగంపై "తేలు''తో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
శశిథరూర్ తరఫు న్యాయవాది మొహమ్మది అలీ ఖాన్ కోర్టులో తన వాదన వినిపించారు. పరువునష్టం కేసు వేసిన బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తొలుత ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కానీ, వాటిని పబ్లిష్ చేసిన మ్యాగజైన్ను కానీ కేసులో చేర్చడంలో విఫలమయ్యారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం (ఆగస్టు 29) తిరస్కరించింది. దీనిపై బీజేపీ నేత ఆయనపై పరువునష్టం కేసు పెట్టారు. దీనిని శశి థరూర్ కోర్టులో సవాలు చేశారు.
బంగ్లాదేశ్లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం కోరారు.
బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. పారిపోయి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతుండడంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ శశిథరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల చివరి నుంచి శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం గురువారం రాత్రి జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీపై సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు.