Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 08 , 2025 | 06:06 AM
వైద్య కళాశాలలలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలపై సుప్రీంకోర్టు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై కేసును మూసివేసింది. కేంద్రం, పూర్వం సిఫారసులు చేసిన నిపుణుల కమిటీ సూచనలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పరీక్షల నిర్వహణపై నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నీట్ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై నమోదైన కేసును మూసివేసింది. గత ఏడాది నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో.. పకడ్బందీగా పరీక్ష నిర్వహణపై సిఫారసుల కోసం ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని కేంద్రం నియమించింది. తాజాగా, ఆ సిఫారసులను అమలు చేస్తామని కోర్టుకు తెలిపింది.