Share News

Supreme Court : మార్చి 14లోపు స్కీం సిద్ధం చేయండి

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:52 AM

రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత చికిత్స విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్షతగాత్రులకు సకాలంలో ఉచిత చికిత్స అందేలా మార్చి 14లోపు పథకం రూపొందించాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌

Supreme Court : మార్చి 14లోపు స్కీం సిద్ధం చేయండి

రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత చికిత్సపై కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి 9: రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత చికిత్స విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్షతగాత్రులకు సకాలంలో ఉచిత చికిత్స అందేలా మార్చి 14లోపు పథకం రూపొందించాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మాసిహ్‌ ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఆ పథకం విధి విధానాల కాపీని, అమలు తీరును వివరిస్తూ మార్చి 21కల్లా అఫిడవిట్‌ సమర్పించాలని నిర్దేశించింది. మోటారు వాహనాల (ఎంవీ) చట్టంలోని సెక్షన్‌ 162(2) ప్రకారం రోడ్డు ప్రమా ద బాధితులకు నగదురహిత చికిత్స అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన అనేక మంది సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత గంటలోపు సమయాన్ని ‘గోల్డెన్‌ అవర్‌’గా ఎంవీ చట్టం నిర్వచించిందని, గాయపడినవారికి ఆ వ్యవధిలోపు చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంద ని పేర్కొంది. అయితే ఈ పథకంలో రోడ్డు ప్రమాద బాధితుల చికిత్సకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు ఇస్తామని కేంద్రం ప్రకటించిందని, ఈ మొత్తం సరిపోదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఆయా అంశాలనూ పరిగణనలోకి తీసుకుని పథకానికి తుదిరూపు ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Updated Date - Jan 10 , 2025 | 04:53 AM