Rail Journey: టీసీ ట్రైన్‌లో టికెట్లు చెక్ చేయరని మీకు తెలుసా
ABN , Publish Date - Mar 21 , 2025 | 10:31 AM
రైలులో టికెట్లు తనిఖీ చేసే వారిలోనూ రెండు రకాలు ఉంటారు. ఒకరు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మరొకరు స్వ్కాడ్. టీటీఈ సాధారణంగా రైలు ప్రారంభ స్టేషన్ నుంచి ముగింపు స్టేషన్ వరకు ఉంటారు. లాంగ్ డిస్టేన్స్ రైళ్లలో అయితే టీటీఈలు ఆరు లేదా ఎనిమిది గంటలకు ఒకరు మారుతుంటారు. స్వ్కాడ్ ఏ స్టేషన్‌లో ఎక్కుతారో.. ఎక్కడ దిగుతారో తెలియదు.

రైలు ప్రయాణంలో ఎక్కువుగా వినిపించే పదం టీసీ.. టికెట్లు తనిఖీ చేసేందుకు టీసీ వస్తున్నారంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. రైలులో ఎవరికైనా ఇబ్బంది తలెత్తినా, మన సీట్లో వేరే వ్యక్తులు కూర్చొన్నా టీసీ ఎక్కడంటూ వెతకడం ప్రారంభిస్తారు. జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగి ఎక్కితే టీసీ కనిపిస్తే భయపడుతుంటారు. అంతేకాదు కొందరైతే దాక్కుంటారు. కానీ టీసీ ట్రైన్‌లో ఉండరనే విషయం చాలామందికి తెలియదు. కేవలం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్స్‌పై మాత్రమే టీసీ ఉంటారు.
రైలులో టికెట్లు తనిఖీ చేసే వారిలోనూ రెండు రకాలు ఉంటారు. ఒకరు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మరొకరు స్వ్కాడ్. టీటీఈ సాధారణంగా రైలు ప్రారంభ స్టేషన్ నుంచి ముగింపు స్టేషన్ వరకు ఉంటారు. లాంగ్ డిస్టేన్స్ రైళ్లలో అయితే టీటీఈలు ఆరు లేదా ఎనిమిది గంటలకు ఒకరు మారుతుంటారు. స్వ్కాడ్ ఏ స్టేషన్‌లో ఎక్కుతారో.. ఎక్కడ దిగుతారో ఎవరికి తెలియదు.వారికి కేటాయించిన విధుల ప్రకారం బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. స్క్వాడ్‌కు టికెట్ లేకుండా దొరికినా, జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగిలో దొరికినా వెంటనే జరిమానా విధిస్తారు. ఉదాహరణకు ఒక పరీక్ష జరుగుతున్నప్పుడు కాపీ కొడుతూ స్క్వాడ్‌కు దొరికితే వెంటనే డిబార్ చేస్తారు. అదే ఎగ్జామ్ హాల్ ఇన్విజిలేటర్‌కు దొరికితే మొదటి తప్పుగా మందలించే అవకాశం ఉంటుంది. టీటీఈ అయితే జరిమానా చెల్లిస్తారా లేదంటే జనరల్ బోగిలోకి వెళ్లిపోతారా అని అడుగుతారు. మనం ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు. స్క్వాడ్‌కు దొరికితే అలాంటి అవకాశం ఉండదు.
టీసీకి టీటీఈకి తేడా
టికెట్ కలెక్టర్‌ను టీసీ అంటారు. రైలు దిగిన తర్వాత ప్లాట్‌ఫామ్‌పై లేదా రైల్వే స్టేషన్ ఎగ్జిట్ గేట్ వద్ద టికెట్లను తనిఖీ చేసే అధికారిని టీసీ అంటారు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) రైలులోని రిజర్వేషన్ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు రైలు ఎక్కారా లేదా అని నిర్థారించుకుంటారు. ప్రయాణికుడు బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కారా.. ప్రయాణికుడు అతడి టికెట్‌పై ప్రయాణిస్తు్న్నారా.. లేదంటే ఇతరుల టికెట్‌పై ప్రయాణిస్తున్నారా అనే విషయాన్ని నిర్థారిస్తారు. టికెట్ కలెక్టర్ రైలులో టికెట్లు తనిఖీ చేయరు. సిబ్బంది కొరత కారణంగా రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యేక విధులు కేటాయిస్తే మాత్రమే టీసీలు టీటీఈలుగా వెళ్లే అవకాశం ఉంటుంది.
ఎవరు పెద్ద..
సాధారణంగా టికెట్ కలెక్టర్, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌లో ఎవరి పోస్ట్ పెద్దదనే సందేహం రావొచ్చు. కానీ ఇద్దరి విధులు ఒకే తరహాలో ఉన్నప్పటికీ రెండింటిని విభిన్న కోణాలుగా చూడాల్సి ఉంటుంది. వీరిద్దరూ కమర్షియల్ విభాగానికి చెందినవారే. రైల్వేశాఖ నియమాల ప్రకారం టీసీ కంటే టీటీఈ పోస్టు పెద్దదిగా చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్డ్.. కాసేపట్లో విడుదల..
Hyderabad: ఇందిరాపార్కులో టాయ్ ట్రైన్..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here