Tej Pratap: డాన్స్ చేస్తావా? సస్పెండ్ చేయనా?.. పోలీసుకు తేజ్ ప్రతాప్ హుకుం
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:32 PM
హోలీ సెలబ్రేషన్స్ లో ఒక పోలీసును డాన్స్ చేయమని తేజ్‌ప్రతాప్ హుకుం జారీ చేసి, ఆయనను బెదిరించినట్టు వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ మండిపడింది.

పాట్నా: హోలీ వేడుకలో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాజ్ యాదవ్ (Tej Pratap Yadav) నిర్వాకం ఇప్పుడు బీహార్‌లో రాజకీయ వివాదమవుతోంది. హోలీ సెలబ్రేషన్స్ (Holi celebrations)లో ఒక పోలీసును డాన్స్ చేయమని తేజ్‌ప్రతాప్ హుకుం జారీ చేసి, ఆయనను బెదిరించినట్టు వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తేజ్ ప్రతాప్ స్టేజ్‌పై మైకు పట్టుకుని, కింద ఉన్న వారికి ఆదేశాలిస్తున్నారు. ఒక దశలో ఒక పోలీసును డాన్స్ చేయమని తేజ్‌ప్రతాప్ ఆదేశించి, అలా చేయకుంటే సస్పెండ్ చేస్తామంటూ బెదిరించారు. పాట్నాలోని తేజ్ ప్రతాప్ నివాసంలో జరిగిన హోలీ వేడుకలో ఈ ఘట్టం చోటుచేసుకుంది.
Amit Shah: నన్ను కూడా కొట్టారు..ఏడు రోజులు జైలు తిండి తిన్నా
జంగిల్ రాజ్‌కు తావులేదు: జేడీయూ
తేజస్వి యాదవ్ చర్యపై జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ మండిపడ్డారు. ఇవాళ బీహార్‌లో అలాంటి చర్యలకు తావులేదన్నారు. ''ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) ముగిసింది. కానీ లాలూ పెద్ద కుమారుడి ప్రవర్తన చూడండి. పోలీసును డాన్స్ చేయమని, లేకుండా చర్య తీసుకుంటానని ఆయన ఆదేశిస్తున్నాడు. లాలూ కుటుంబం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీహార్ మారింది, ఇలాంటి చర్యలకు ఎంతమాత్రం చోటులేదు'' అని రంజన్ అన్నారు.
ఇది ట్రయిలర్ మాత్రమే: బీజేపీ
ఆర్జేడీ ఏ విధంగా చట్టరహిత పాలన సాగిస్తుందో, అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ''తండ్రి లాగానే కొడుకు. ఇంతకు ముందు లాలూ ప్రసాద్ చట్టాన్ని గుప్పిట్లో పెట్టుకుని బీహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా ఆయన కుమారుడు పోలీసులను డాన్స్ చేయమని ఒత్తిడి తేవడం, బెదిరించడం చేస్తున్నారు'' అని మండిపడ్డారు. ఇది కేవలం ట్రయిలర్ మాత్రమేనని, ఒకవేళ ఆర్జేడీ అధికారంలోకి వస్తే చట్టాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని చట్టాన్ని అమలు చేసే అధికారులను కీలుబొమ్మలుగా మారుస్తుందని, అందుకే వారిని అధికారానికి దూరంగా ఉంచాలని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగాల్సి ఉన్నాయి.
ఇవి కూాడ చదవండి
Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ
DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్
MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.