Share News

Viral: మరణించిన 20 ఏళ్ల తర్వాత కొడుకు కలలోకొచ్చిన తండ్రి.. సమాధి తవ్విన కుటుంబ సభ్యులు.. ఊహించని షాక్..

ABN , Publish Date - Jan 15 , 2025 | 07:58 PM

Viral News: కొడుకు కలలోకి కన్న తండ్రి తరచూ వచ్చి.. తన సమాధి శిథిలావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తుండే వాడు. దీంతో తండ్రి సమాధిని తవ్వి ఆ కుటుంబం షాక్‌కి గురి అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Viral: మరణించిన 20 ఏళ్ల తర్వాత కొడుకు కలలోకొచ్చిన తండ్రి.. సమాధి తవ్విన కుటుంబ సభ్యులు.. ఊహించని షాక్..
Graveyard in Daranagar

లక్నో, జనవరి 15: 20 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ తండ్రి.. తన కొడుకుకి కలలో కనిపించాడు. ఆ కలలో తన సమాధి తీవ్ర దుస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిని బాగు చేయాలంటూ తన కుమారుడికి కలలో సూచించాడు. ఇలా పలుమార్లు.. అతడి కలలోకి తండ్రి వచ్చి తన సమాధి దుస్థితిపై ఆవేదన చెందడంతో.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకు వెళ్లాడు. దీంతో శ్మశానానికి చేరుకొని సమాధి తవ్వి చూశారు. అక్కడ కనిపించిన సీన్ చూసి వారంతా ఒక్క సారిగా షాక్‌కి గురయ్యారు.

ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబి జిల్లాలోని దారానగర్‌లో ఈ సంఘటన గతేడాది అక్టోబర్‌లో చోటు చేసుకుంది. దారానగర్‌లో అక్తర్ సుభానీ నివసిస్తున్నారు. అతడి తండ్రి మౌలానా అన్సార్ అహ్మద్ దాదాపు 20 ఏళ్ల క్రితం మరణించాడు. అయితే అక్తర్ సుభానీ కలలోకి అతడి తండ్రి మౌలానా అన్సార్ అహ్మద్ తరచూ వచ్చే వాడు. ఆ క్రమంలో తన సమాధి పాడైపోయిందంటూ ఆ కలలో ఆవేదన వ్యక్తం చేసేవాడు. సమాధిలోకి నీళ్లు వచ్చి చేరుతోన్నాయని.. బాగు చేయాలంటూ తన కుమారుడితో మొరపెట్టుకొన్నాడు.


ఈ విషయాన్ని అక్తర్.. తన కుటుంబ సభ్యులకు వివరించాడు. వారంతా కలిసి వెంటనే ఊరి చివర ఉన్న శ్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ మౌలానా అన్సార్ సమాధి నిజంగానే శిథిలావస్థకు చేరుకొని ఉండటం చూసి వారంతా ఆశ్చర్యపోయారు. దీంతో వారంతా బరేల్వి వర్గానికి చెందిన మత పెద్దను సంప్రదించారు. తండ్రి సమాధికి మరమ్మతు నిర్వహించవచ్చని అన్సార్ కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో సమాధిని బాగు చేసేందుకు వారు ఉపక్రమించారు.

Also Read: మళ్లీ నోటీసులు.. విచారణకు రాలేనన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి


అయితే సమాధి తవ్వుతోన్నారన్న విషయం వైరల్‌గా మారింది. దీనిని చూసేందుకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది. సమాధిని జాగ్రత్తగా తవ్వుతోండగా.. ఊహించని సంఘటన వారికి ఎదురైంది. అంతే అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. రెండు దశాబ్దదాల క్రితం మరణించిన మౌలానా అన్సార్ అహ్మద్ మృతదేహం ఏ మాత్రం చెక్కుచెదర లేదు. కుళ్లిపోకుండా అలాగే ఉంది. ఈ విషయం క్షణాల్లో ఆ పరిసర ప్రాంతాలకు పాకిపోయింది. వారంతా శ్మశాన వాటికకు పోటెత్తారు. ఈ విషయాన్ని చూసి వారంతా ఆశ్చర్య పోతున్నారు.

Also Read: ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు


ఇక మౌలానా అన్సార్ మృతదేహాన్ని శుభ్రం చేసి.. మళ్లీ ఖననం చేశారు. ఈ సందర్భంగా సమాధిని చాలా బలంగా నిర్మించారు. అయితే 20 ఏళ్ల క్రితం మరణించిన మౌలానా అన్సార్ మృతదేహం చెక్క చెదరకుండా ఉండటం చూసి ప్రజలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవుడి మహిమ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అద్భుతం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పోలీస్ శాఖలో గ్యాంగ్‌స్టర్‌.. చివరకు భలే దొరికాడు


ఈ మృతదేహం కుళ్లక పోవడంపై పలు వాదనలు వినిపిస్తు్న్నాయి. అందుకు కారణాలు సైతం ఉన్నాయని వివరిస్తున్నారు. ఎవరైనా మరణించిన అంతరం సాధారణ బ్యాక్టీరియా, శిలీంధ్రాల వద్ద మృతదేహం కుళ్లిపోతుంది. కానీ పలుమార్లు పర్యావరణ పరిస్థితులు, శననం చేసే విధానం వంటి అంశాల వల్ల ఈ ప్రక్రియ అత్యంత నెమ్మదిగా జరగవచ్చు లేదా నిలిచిపోవచ్చని చెబుతున్నారు.

Also Read: మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం

Also Read: మరికొద్ది రోజుల్లో బడ్జెట్.. వీటిని గమనించండి

For Telangana News And Telugu News

Updated Date - Jan 15 , 2025 | 08:03 PM