Share News

US Visa: ‘బాట్స్‌’తో అక్రమంగా వీసా అపాయింట్‌మెంట్లు!

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:39 AM

రెండు వేల వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇవి ‘బాట్స్‌’ను ఉపయోగించి మోసపూరితంగా పొందిన అపాయింట్‌మెంట్లుగా గుర్తించినట్లు ఎక్స్‌ లో పేర్కొంది.

US Visa: ‘బాట్స్‌’తో అక్రమంగా వీసా అపాయింట్‌మెంట్లు!

  • 2 వేల దరఖాస్తులను రద్దు చేసిన అమెరికా ఎంబసీ

న్యూఢిల్లీ, మార్చి27: రెండు వేల వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇవి ‘బాట్స్‌’ను ఉపయోగించి మోసపూరితంగా పొందిన అపాయింట్‌మెంట్లుగా గుర్తించినట్లు ‘ఎక్స్‌’లో పేర్కొంది. తమ నిబంధనలను ఉల్లంఘించే ఏజెంట్లు, మధ్యవర్తులను సహించబోమని స్పష్టం చేసింది. అమెరికా వ్యాపార (బీ1), పర్యాటక (బీ2), విద్యార్థి వీసాలకు అపాయింట్‌మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వేచిచూడాల్సి వస్తోంది.


సకాలంలో దొరకాలంటే చాలా మంది ఏజెంట్లను ఆశ్రయించకతప్పడం లేదు. ఏజెంట్ల ద్వారా నెలరోజుల్లోనే అపాయింట్‌మెంట్‌ దొరుకుతోంది. ఏజెంట్లు ఒక్కో వీసా దరఖాస్తుదారుడి నుంచి రూ.30-35వేల వరకు వసూలు చేస్తుంటారు. ఏజెంట్లు ‘బాట్స్‌’తో వీసా ఇంటర్వ్యూ స్లాట్లను బ్లాక్‌ చేస్తున్నారని, దీంతో సొంతంగా దరఖాస్తు చేసుకునే వారికి ఎన్నో నెలల తర్వాత గానీ అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని సమాచారం.

Updated Date - Mar 28 , 2025 | 05:39 AM