లవ్ ట్రయాంగిల్.. పాత ప్రియుడ్ని పిలిపించి కొత్త ప్రియుడితో..
ABN , Publish Date - Mar 19 , 2025 | 09:47 PM
యువతి ఒకే సారి ఇద్దర్నీ ప్రేమించటం మొదలెట్టింది. తర్వాత కొత్త ప్రియుడి మోజులో పడిపోయింది. ప్లాన్ ప్రకారం యువతి రాత్రి 11 గంటల సమయంలో దిల్‌జీత్‌ను ఓ చోట కలుద్దాం రమ్మంది. అతడు ఆమె చెప్పిన చోటుకు స్కూటీ మీద వెళ్లాడు.

కొత్త ఒక వింత పాత ఒక రోత అని తెలుగులో సామెత ఉంది. ఏదైనా సరే.. కొత్తలో ఉన్నంత ఆసక్తిగా తర్వాత ఉండదు. ఒక్కోసారి రోతగా కూడా అనిపిస్తుంది. ఈ సామెత బంధాలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో.. ఇద్దరు వ్యక్తులు ప్రేమ పడిన తర్వాత కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు ఎంతో అద్భుతంగా గడిపేస్తారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనట్లు ప్రవర్తిస్తారు. తర్వాత రాను రాను ఆ ప్రేమ తగ్గుతుంది. కొన్ని సార్లు ఇద్దరిలోనూ ఆసక్తి తగ్గుతుంది. మరికొన్ని సార్లు ఒక్కరిలోనే ఆసక్తి తగ్గి.. మిగిలిన వారు ప్రేమిస్తూనే ఉంటారు. ఇలాంటి టైంలోనే ఇద్దరి మధ్యాగొడవలు మొదలవుతాయి. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒకే వ్యక్తి ఇద్దర్ని ప్రేమిస్తుంటాడు. అది ఆడవాళ్లు కావచ్చు.. మగవాళ్లు కావచ్చు. ఒకరికి తెలియకుండా మరొకర్ని మెయిన్‌టేన్ చేస్తుంటారు.
మరికొన్ని సార్లు ఓ వ్యక్తికి ఈ విషయం తెలిసే ఉంటుంది. దీన్నే లవ్ ట్రయాంగిల్ అంటారు. ఈ లవ్ ట్రయాంగిల్ కారణంగా ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి కొత్త ప్రియుడితో కలిసి పాత ప్రియుడ్ని చంపేసింది. పాత ప్రియుడ్ని నమ్మించి మోసం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన దిల్‌జీత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం నుంచి ఆమె మరో వ్యక్తిని కూడా ప్రేమిస్తోంది. కొత్త ప్రియుడికి పూర్తిగా బానిస అయిపోయింది. సదరు యువతి కొత్త ప్రియుడు.. దిల్‌జీత్‌ను చంపి సంతోషంగా బతకాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ ప్లాన్ వేసుకున్నారు.
ప్లాన్ ప్రకారం యువతి రాత్రి 11 గంటల సమయంలో దిల్‌జీత్‌ను ఓ చోట కలుద్దాం రమ్మంది. అతడు ఆమె చెప్పిన చోటుకు స్కూటీ మీద వెళ్లాడు. అక్కడ కొత్త ప్రియుడు అతడ్ని చంపడానికి ప్రయత్నించాడు. భయపడిపోయిన దిల్‌జీత్ స్కూటీని అక్కడినుంచి పరుగులు పెట్టించాడు. కొత్త ప్రియుడు అతడ్ని వదల్లేదు. బైకు మీద వెంటాడి ఓ చోట అడ్డగించాడు. తుపాకితో దిల్‌జీత్ రొమ్ముపై కాల్చాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మార్చి 14వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?
కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు
రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది