Venkaiah Naidu: దేశ రాజకీయాల్లో నన్ను వెలిగించింది తెలుగే!
ABN , Publish Date - Jan 06 , 2025 | 05:12 AM
అలంకారాల్లో ఒదిగి పోయే విలక్షణమైన భాష తెలుగు. వేల మాటల్లో చెప్పగలిగే భావాన్ని సైతం ఒక్క మాటలో భావయుక్తంగా చెప్పే వెసులుబాటు మన భాష సొంతం’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
ఇంగ్లిషు నేర్చుకుందాం.. కానీ వ్యామోహం వద్దు: వెంకయ్యనాయుడు
అలంకారాల్లో ఒదిగి పోయే విలక్షణమైన భాష తెలుగు. వేల మాటల్లో చెప్పగలిగే భావాన్ని సైతం ఒక్క మాటలో భావయుక్తంగా చెప్పే వెసులుబాటు మన భాష సొంతం’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగులో ఆలోచించడం వల్లే ఇతర భాషల్లోనూ అంతే సాధికారతతో ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడగలమని, తనను దేశ రాజకీయాల్లో వెలిగించింది తెలుగేనని భావోద్వేగంతో చెప్పారు. ఇంగ్లిషు నేర్చుకుందాం కానీ దానిపై వ్యామోహాన్ని వీడుదామని పిలుపునిచ్చారు. ‘మాతృభాష రాకపోతే శ్వాస ఆగిపోయినట్లే. మాతృభాష మరిస్తే మాతృబంధం వీడినట్లే. కనుక తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు మాతృభాష మాధుర్యాన్ని గోరుముద్దల్లా అందించాల’ని కోరారు.