Share News

Jairam Ramesh: మోదీ ఎప్పుడు వెళ్తారు? అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు?

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:21 PM

హింసాకాడంతో అట్టుడికిన మణిపూర్‌లో గత 22 నెలల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 60,000 మంది నిరాశ్రయులై సహాయ, పునరావస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని జైరామ్ రమేష్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Jairam Ramesh: మోదీ ఎప్పుడు వెళ్తారు? అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు?

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన అమలు చేస్తున్న మణిపూర్‌లో ఆరుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రతినిధి బృందం శనివారంనాడు పర్యటించడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ (Jairam Ramesh) స్వాగతించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ఆ రాష్ట్రంలో పర్యటిస్తారని ప్రశ్నించారు. హోం శాఖ పనితీరుపై పార్లమెంటులో మాట్లాడిన అమిత్‌షా మణిపూర్ గురించి మాత్రం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

Nagpur Violence: అల్లర్లకు పాల్పడిన వారి నుంచే ఆస్తి నష్టం వసూలు: ఫడ్నవిస్


హింసాకాడంతో అట్టుడికిన మణిపూర్‌లో గత 22 నెలల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 60,000 మంది నిరాశ్రయులై సహాయ, పునరావస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని జైరామ్ రమేష్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ''ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. మణిపూర్‌లో రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. అక్కడ రాష్ట్రపతి పాలన విధించేందుకు 18 నెలల సమయం ఎందుకు తీసుకున్నారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అక్కడ పర్యటించడం ముదావహం. కానీ, ప్రధాని ఎప్పుడు పర్యటిస్తారన్నదే అతిపెద్ద ప్రశ్న'' అని అన్నారు.


హోం శాఖ పనితీరుపై చర్చకు అమిత్‌షా రాజ్యసభలో సమాధానం ఇచ్చినప్పటికీ మణిపూర్ ప్రస్తావన చేయకపోవడాన్ని జైరామ్ రమేష్ ప్రశ్నించారు. నాలుగు గంటలు ప్రసంగించిన హోం మంత్రి మణిపూర్‌ గురించి చెప్పిందేమీ లేదన్నారు. 2022 ఫిబ్రవరిలో భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచిందని, కానీ 15 నెలల్లోనే మణిపూర్‌లో మంటలు చెలరేగాయని చెప్పారు. దానికి సమాధానం లేదని, ప్రధాని అక్కడకు ఎందుకు వెళ్లలేదనడానికి కూడా సమాధానం లేదని అన్నారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంలో జాప్యాన్ని ప్రశ్నించారు. మిజోరాం వెళ్లిన అమిత్‌షా మణిపూర్ వెళ్లకపోవడాన్ని నిలదీశారు.


బ్యాంకాక్‌కు ముందో..వెనకో..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్ వెళ్లడానికి ముందో, వెళ్లి వచ్చిన తర్వాతో మణిపూర్‌లో పర్యటించాలని, బాధితులను స్వస్థత పరచేందుకైనా ఆయన అక్కడ పర్యటిస్తారని ఆశిస్తు్న్నామని జైరామ్ రమేష్ అన్నారు. బ్యాంకాక్‌లో ఏప్రిల్ 2 నుంచి 4 వరకూ జరిగే BIMSTEC సదస్సుకు మోదీ వెళ్లనున్నారు.


ఇవి కూడా చదవండి..

JAC Meet Delimitation: డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జేఏసీ తదుపరి భేటీ

Chennai: మాజీసీఎం ఘాటు సమాధానం.. మీ పార్టీని తన్నుకుపోతారు

MLA: ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

Read Latest and National News

Updated Date - Mar 22 , 2025 | 06:23 PM