Share News

Mahakumbh Mela: మహాకుంభ మేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్! గురువుకు ప్రత్యేక పూజలు!

ABN , Publish Date - Jan 13 , 2025 | 10:33 PM

యాపిల్ వ్యవస్థాపకుడైన దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. అక్కడ తన ఆధ్యాత్మిక గురువుకు వందనాలు అర్పించి సంత్కరించారు.

Mahakumbh Mela: మహాకుంభ మేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్! గురువుకు ప్రత్యేక పూజలు!

ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ సంస్థ వ్యవస్థాపకులు, దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి, యాపిల్ సహ వ్యవస్థాపకురాలైన లారీన్ పావెల్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. నిరంజనీ అఖారా సాధువు, తనకు గురువైన వ్యాసానంద గిరి మహరాజ్‌కు పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించే తెల్లని దుస్తులు, కాషాయం రంగు షాల్, రుద్రాక్షలు ధరించిన వచ్చిన లారీన్ ఈ సందర్భంగా గిరి మహరాజ్‌కు ప్రణమిల్లారు. శనివారం ఆమె తన ఆధ్యాత్మిక గురువుతో కలిసి కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. లారీన్ ప్రయాగ్‌రాజ్‌లో 17 రోజుల పాటు గడపనున్నారు. ఈ సందర్భంగా కల్పవాస్‌ను అనుష్టించడంతో పాటు త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరిస్తారు (Kumbhmela).


Mahakumbh 2025: తొలిరోజు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు

లారీన్ పావెల్ జాబ్స్ ఎమర్సెన్ కలెక్టివ్ అనే ఇన్వెస్ట్‌మెంట్, అడ్వొకెసీ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. ది అట్లాంటిక్ కూడా ఆమెదే. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం, ఆమె ఆస్తుల మార్కెట్ విలువ 15 బిలియన్ డాలర్లు.

కాగా స్టీవ్ జాబ్స్ కూడా 1974లో భారత్‌ను సందర్శించిన విషయం తెలిసిందే ఉత్తరాఖండ్‌లోని కైంచీ ఆశ్రమంలోని నీమ్ కరోలీ బాబాను దర్శించుకున్నారు. తన కాలేజీ ఫ్రెండ్‌తో కలిసి ఆయన భారత్‌కు వచ్చారు. యాపిల్ సంస్థ ఏర్పాటుతో దార్శనికుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్‌లో 56 ఏళ్ల వయసులో కన్నుమూశారు.


Maha Kumbh Mela 2025: కుంభమేళా చేరుకున్న బాహుబలి బాబా.. 800 కిలోమీటర్లకుపైగా సైకిల్ ప్రయాణం

ఇక 46 రోజుల పాటు సాకే మహాకుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది. ఇదో ఆధ్యాత్మిక సందర్భమని ప్రధాని మోదీ అన్నారు. విశ్వాసం, భక్తి, సంస్కృతిల సంగమం అసంఖ్యాకమైన భక్తులను ఒక దగ్గరకు చేర్చిందని వ్యాఖ్యానించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 10:38 PM