Nidhi Tewari: చిన్న వయసులోనే ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా.. ఎవరీ నిధి తివారీ
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:58 PM
ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ అనే యువ ఐఎఫ్ఎస్ అధికారి నియమితులయ్యారు. 2013లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశారు. అందులో 96వ ర్యాంకు తెచ్చుకున్నారు. ఓ సంవత్సరం పాటు అండర్ సెక్రటరీగా పని చేశారు.

యువ ఐఎఫ్ఎస్ అధికారి నిధి తివారీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినేట్ అపాయింట్‌మెంట్ కమిటీ నిధి నియామకాన్ని ఆమోదించింది. ఇక, నిధి గురించిన వ్యక్తిగత విషయాలకు వస్తే.. నిధి తివారీ 2013లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశారు. అందులో 96వ ర్యాంకు తెచ్చుకున్నారు. ఆమెది వారణాసిలోని మెహ్ముర్‌గంజ్.. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి గెలిచి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె 2022నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంలో పని చేస్తున్నారు. ఓ సంవత్సరం పాటు అండర్ సెక్రటరీగా పని చేశారు. తర్వాత 2023, జనవరి 6వ తేదీన ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2013లో సివిల్ సర్వీస్ పరీక్ష పాసవ్వటానికి ముందు వారణాసిలో ఆమె అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. సక్సెస్ సాధించారు.
మోదీ మెచ్చిన లడ్డు
ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో తనకు ఇష్టమైన లడ్డు గురించి ప్రస్తావించారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డు తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు. తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లా సోదరీమణులు ఇప్పపువ్వుతో కొత్త ప్రయోగం చేశారని ఆయన తెలిపారు. వారు రకరకాల వంటలు చేస్తున్నారని చెప్పారు. వాటిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారని కూడా అన్నారు. వారి వంటల్లో ఆదివాసీల సంస్కృతి, తీయదనం దాగుందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holiday: రంజాన్ రోజు బ్యాంకులకు సెలవా.. కాదా..