Hair Care Tips: ఈ నూనెను వాడితే చాలు.. జుట్టుకు రంగు వేయాల్సిన అవసరం లేదు..
ABN , Publish Date - Jan 06 , 2025 | 05:37 PM
మీ జుట్టు రంగు తెల్లగా ఉందని బాధపడుతున్నారా? అయితే, మీరు ఇంట్లోనే తయారుచేసుకునే ఒక ప్రత్యేక నూనె తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుతుంది.
Hair Care Tips: మారిన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మందికి చిన్నవయసులోనే అనేక జుట్టు సమస్యలు వస్తున్నాయి. జుట్టు రాలిపోవడం, తెల్లగా మారడం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. సాధారణంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవడానికి చాలా మంది హెయిర్ డై వాడుతుంటారు. అయితే, హెయిర్ డై ఉపయోగించకుండా సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మీరు ఇంట్లోనే తయారుచేసుకునే ప్రత్యేక హెయిర్ ఆయిల్ సహాయంతో తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
జీడిపప్పు
మెంతి గింజలు
కాఫీ పొడి,
కలోంజీ
ఆలివ్ ఆయిల్
పై మిశ్రమాలను కలిపి పొడి చేసుకోవాలి.
తయారుచేయు విధానం
ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని వేడి చేయాలి. అందులో ఆలివ్ ఆయిల్ నూనెను వేసి మరిగించాలి. ఆ తర్వాత వేడినూనెలో జీడిపప్పు, మెంతి గింజలు, కాఫీ పొడి, కలోంజీల మిశ్రమం వేసి 5 నుంచి10 నిమిషాల వరకు బాగా మరిగించాలి. వేడిచేసిన నూనె చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ప్రతిరోజూ రాత్రి
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెను మీ జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయండి. ఇలా రెండు వారాల పాటు కంటిన్యూగా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)