Winter Care Tips: ఈ ఫేస్ మాస్క్ వేసుకోండి.. మీ ముఖం మెరిసిపోతుంది..
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:09 PM
చలికాలంలో కాఫీ ఫేస్ మాస్క్ ధరించడం వల్ల ముఖం మెరిసిపోతుంది. ఈ ఫేస్ మాస్క్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేస్తే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా..
చలికాలంలో కాఫీ ఫేస్ మాస్క్ ధరించడం వల్ల ముఖంలో మెరుపు పెరుగుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది మీ ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. కాఫీలో తేనె కలుపుకుంటే అద్భుతమైన ఫేస్ మాస్క్ అవుతుంది. ఇది మీకు మచ్చలు లేని, మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
కాఫీ ఫేస్ మాస్క్ ఎలా చేయాలి?
ఒక చెంచా కాఫీ, ఒక చెంచా తేనె, ఒక చెంచా శెనగపిండిని ఒక గిన్నెలో తీసుకుని బాగా కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్‌ని ముఖంపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది మీ ముఖం నుండి డెడ్ స్కిన్ తొలగిస్తుంది. ఈ ఫేస్ మాస్క్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ ముఖం మెరుస్తుంది.
చర్మ వ్యాధులను నివారించవచ్చు..
చలికాలంలో కాఫీ ఫేస్ మాస్క్ చర్మ సమస్యలను దూరం చేస్తుంది. తేనె ముఖానికి మాయిశ్చరైజ్ చేస్తుంది.. శెనగ పిండి చర్మ సమస్యలను దూరం చేస్తుంది. కాఫీ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల చలికాలంలో వచ్చే చర్మ వ్యాధులను నివారించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)