Share News

Parents: పిల్లల ఎదుగుదల మంచిగా ఉండాలంటే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 05:07 PM

పిల్లలకు మంచి నడవడికను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఎదుగుదల మంచిగా ఉండాలంటే, ముందుగా పేరెంట్స్ చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవెంటో తెలుసుకుందాం..

Parents: పిల్లల ఎదుగుదల మంచిగా ఉండాలంటే..
Parents with Children

పిల్లల మనస్సులో ఒక సానుకూల దృక్పథాన్ని కలుగజేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే స్కూల్‌ల్లో కన్నా ఇంట్లోనే ఎక్కువగా అలవాట్లు, పద్ధతులు నేర్చుకుంటారు. అయితే, పిల్లల ఎదుగుదల మంచిగా ఉండాలంటే, ముందుగా తల్లిదండ్రులు చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవెంటో తెలుసుకుందాం..

నిద్రలేవడం:

పిల్లల కంటే ముందే తల్లిదండ్రులు నిద్రలేవడానికి ప్రయత్నించాలి. రోజును త్వరగా ప్రారంభిస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలా కాకుండా నిద్రలేచిన వెంటనే ఆలస్యమైపోతుందని చిరాకు పడటం, కంగారుపడటం వంటివి చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీ పిల్లలకు కూడా అవే అలవాటు అవుతాయి.

చదివే అలవాటు :

మీ పిల్లలతో కలిసి ఉదయం పూట పుస్తకాలు లేదా వార్తాపత్రికలు చదివే అలవాటు చేసుకోవాలి. ఇలా అలవాటు చేయడం వల్ల వారి వ్యక్తిత్వం పెరుగుతుంది. అంతేకాకుండా మంచి విలువలను నేర్చుకుంటారు.


ధ్యానం చేయండి:

ఉదయాన్నే కొన్ని వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ అలవాట్లు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతాయి. అంతేకాకుండా మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ నుండి మీ పిల్లలు ఈ అలవాటును చిన్నతనంలో నేర్చుకుంటే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మంచి ఆహారం:

మీ పిల్లలకు ఉదయాన్నే పండ్లు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో శారీరక బలం పెరుగుతుంది.

ఇంటి పనులు:

మీ పిల్లలకు ఇంటి పనులు కొన్ని చేయమని సూచించండి. ఇలా చేయడం వల్ల ఇంటి బాధ్యతలు తెలుస్తాయి. అంతేకాకుండా మీరు ఎంత బీజీగా ఉన్నా కుటుంబ సభ్యులతో కాసేపు ప్రేమగా మాట్లాడండి. మంచి విలువలను నేర్పించండి.

Updated Date - Jan 10 , 2025 | 05:09 PM