NRI: డాలాస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన
ABN , Publish Date - Mar 30 , 2025 | 08:35 PM
NRI: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో 15వ రక్తా దాన కార్యక్రమం విజయంగా జరిగింది. స్థానిక డీఎఫ్‌డబ్ల్యు మెట్రో ఏరియాలోని ఐటీ స్పిన్ కంపెనీ ప్రాంగణంలో ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 80 మంది హాజరయ్యరు.

డాలస్, మార్చి 30: పండగలు, పర్వదినాల వేళ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తెలుగు వారి మదిని దోచుకొంటుంది. ఆ క్రమంలో డాలస్‌లో టీపాడ్ ఆధ్వర్యంలో 15వ రక్త దాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఎప్పటిలాగే డీఎఫ్‌డబ్ల్యు మెట్రో ఏరియాలోని ఐటీ స్పిన్ కంపెనీ ప్రాంగణంలో ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఈ రక్త దాన కార్యక్రమానికి 85 మంది నుంచి 60 పింట్ల రక్తాన్ని సేకరించింది. ఒక్కో పింట్ రక్తం ముగ్గురి ప్రాణాలను నిలపడానికి పనికి వస్తుందని రక్త సేకరణ సంస్థ కార్టర్ బ్లడ్‌కేర్ వెల్లడించింది.
ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో, అల్లెన్, మెక్ కిన్నీ, ప్రాస్పర్, ప్లేనో, ఇర్వింగ్, కొప్పెల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన దాతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని రవి చెన్నూరి, స్వప్న గొల్లపల్లి కోఆర్డినేట్ చేశారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), పాండు రంగారెడ్డి పాల్వాయి (బీవోటీ చెయిర్), రావు కల్వల (ఎఫ్‌సీ చెయిర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్) గైడ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి టీపాడ్ బృందం సభ్యులు, స్థానిక పాఠశాలల నుంచి కొందరు విద్యార్థులు సహకారం అందించారు. అయితే ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి టీపాడ్ ధన్యవాదాలు తెలిపింది. టీపాడ్ ప్రతి ఏటా.. రెండు సార్లు రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తోంది. తాజాగా నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమం 15వది అని టీపాడ్ నిర్వాహకులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AFSPA: మణిపూర్‌పై కేంద్రం కీలక నిర్ణయం
Maoists: దెబ్బ మీద దెబ్బ.. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ
T Jayaprakash Reddy: నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి
టెన్త్ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం
జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
CM Revanth Reddy: శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి
NRI: తానా 24వ సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం
మరిన్నీ ఎన్నారై వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..