కనుల పండువగా సింగరకొండ తిరునాళ్లు
ABN, Publish Date - Mar 15 , 2025 | 07:18 AM
సింగరకొండ తిరునాళ్లగా ప్రసిద్ధికెక్కిన ఈ తిరునాళ్లు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి హోలీపూర్ణిమ వరకు మూడురోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్లకూ భక్తులు విశేష పూజలు చేస్తారు.

సింగరకొండ తిరునాళ్లగా ప్రసిద్ధికెక్కిన ఈ తిరునాళ్లు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి హోలీపూర్ణిమ వరకు మూడురోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.

సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్లకూ భక్తులు విశేష పూజలు చేస్తారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్లను దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

అద్దంకి నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామివారి 70వ వార్షికోత్సవ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

స్వామివార్లకు మంత్రి హోదాలో గొట్టిపాటి రవికుమార్ అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల ఆలయాలకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్చించారు.

ఆలయంలో దీపారాధన చేస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

స్వామి వారి కలశానికి మొక్కుతున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఆలయ నిర్వాహకులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్

స్వామివార్లకు పట్టు వస్త్రాలు తీసుకుని వస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక డిజైన్లతో విద్యుత్తు ప్రభలను అలంకరించారు. ఊరేగింపుగా వచ్చిన ప్రభలు ఆలయం ముందు కొలువుదీరాయి.

సింగరకొండ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రభలను చూడటానికి తరలివచ్చారు అనంతరం స్వామి వార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

స్వామివారికి విశేష అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేశారు.
Updated at - Mar 15 , 2025 | 12:02 PM