Share News

Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:50 PM

ఆ వ్యక్తి అందరిలాంటి మనిషే. అయితే అతడి మొహం మాత్రం ఎప్పుడూ లాక్ చేసి ఉంటుంది. అంటే అతడి తల చుట్టూ ఓ పంజరం (Cage) లాంటిది ఉంటుంది. ఏదైనా తాగాలనుకుంటే స్ట్రా ద్వారా తాగుతాడు. భోజనం చేసే సమయంలో అతడి భార్య ఆ లాక్ ఓపెన్ చేస్తుంది. భోజనం పూర్తవగానే లాక్ వేసేస్తుంది. అతడు ఎక్కడికి వెళ్లినా ఆ బోనుతోనే వెళ్తాడు.

Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Man locked his face in a cage

ఆ వ్యక్తి అందరిలాంటి మనిషే. అయితే అతడి మొహం మాత్రం ఎప్పుడూ లాక్ చేసి ఉంటుంది. అంటే అతడి తల చుట్టూ ఓ పంజరం (Cage) లాంటిది ఉంటుంది. ఏదైనా తాగాలనుకుంటే స్ట్రా ద్వారా తాగుతాడు. భోజనం చేసే సమయంలో అతడి భార్య ఆ లాక్ ఓపెన్ చేస్తుంది. భోజనం పూర్తవగానే లాక్ వేసేస్తుంది. అతడు ఎక్కడికి వెళ్లినా ఆ బోనుతోనే వెళ్తాడు. అతడి మొహం బోనులో ఉండడానికి కారణం అతడిని సిగరెట్ వ్యసనానికి దూరం చేయడమే (Quitting smoking). తన సిగరెట్ అలవాటును విడిచిపెట్టడానికి, అతను తన తలను బోనులో బంధించాడు (Head in Cage). టర్కీకి చెందిన ఈ వ్యక్తి కథ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Viral News).


టర్కీకి చెందిన ఇబ్రహీం యుసెల్ అనే వ్యక్తి 2013లో తన తలను బోనులో బంధించుకున్నాడు. అప్పటికి అతడి వయసు 42 సంవత్సరాలు. ఇబ్రహీం యూసెల్ తలపై ఉన్న పంజరానికి చెందిన తాళం చెవి అతని భార్య మాత్రమే ఉంటుంది. అతని భోజన సమయంలో ఆమె దానిని తెరుస్తుంది. ఇబ్రహీం తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఎంతో వేదన అనుభవించి మరణించాడు. ఇబ్రహీం కూడా తండ్రిలాగానే విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడు. తన తండ్రి పరిస్థితి చూసిన తర్వాత సిగరెట్ వ్యసనాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే అది అతడికి అంత సులభం కాలేదు.


సిగరెట్ తాగే వ్యసనానికి దూరం కావడం ఎలా అని ఎంతగానో ఆలోచించాడు. చివరకు అతడి భార్యకు ఈ బోను ఐడియా వచ్చింది. తల చుట్టూ పంజరంలాంటిది ఏర్పాటు చేస్తే సిగరెట్ తాగడం కష్టంగా మారుతుందని, బ్రెయిన్ అదుపులో ఉంటుందని ఆమె భావించింది. దీంతో ఇబ్రహీం 2013లో ఈ ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తానికి ఆ అలవాటు నుంచి దాదాపు దూరమయ్యాడు. సోషల్ మీడియాలో ఇతడి కథ విపరీతంగా వైరల్ అవుతోంది. 2.6 కోట్ల కంటే ఎక్కువ మంది ఆ ట్వీట్‌ను వీక్షించారు. దాదాపు 2 లక్షల మంది లైక్ చేసి అతడిని, అతడి భార్యను ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..


Tiger Hunting video: మూడు పులి పిల్లలు, ఒక జింక.. ఆ వేట చివరకు ఎలా ముగిసిందో చూడండి..


Optical Illusion: ఈ ఫొటోలో మొదట మీకు ఏం కనబడింది.. దానిని బట్టి మీ క్యారెక్టర్‌ను అంచనా వేయవచ్చు..


Viral Video: వామ్మో.. హార్న్ కొడితే పరిస్థితి ఇలా ఉంటుందా? బస్సు డ్రైవర్లకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..


Viral Helmet Rule: ఇండియాలో ఇంతే.. హెల్మెట్ రూల్‌ను పెట్రోల్ బంక్ సిబ్బంది ఎలా పాటిస్తున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 06:09 PM