Share News

Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:23 PM

``ఇంట్లో భార్యను చూస్తూ ఎంత సేపు కూర్చోగలరు. వారానికి 90 గంటలు పని చేస్తే మంచిది. కుదిరితే ఆదివారాలు కూడా పని చేయాలి`` అంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..
Anand Mahindra,

``ఇంట్లో భార్యను చూస్తూ ఎంత సేపు కూర్చోగలరు. వారానికి 90 గంటలు పని చేస్తే మంచిది. కుదిరితే ఆదివారాలు కూడా పని చేయాలి`` అంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతకు ముందు ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి కూడా వారానికి 70 గంటలు పని చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. వీరి వ్యాఖ్యలపై సాధారణ ఉద్యోగులే కాదు.. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందించారు (Working Hours).


దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ``వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్- 2025``లో ఆనంద్ మహీంద్రా మాట్లాడారు. ``అసలు సమస్య 70 గంటలు, 90 గంటలు పని వేళలు కాదు. ఎంత సమయం పని చేశామన్నది ముఖ్యం కాదు. ఎంత క్వాలిటీగా పని చేశామన్నది ముఖ్యం. నేను పనిలో నాణ్యతనే చూస్తాను, పని వేళలను కాదు`` అంటూ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఇతరులపై తనకు చాలా గౌరవం ఉందని, అయితే పని గంటలపై చర్చ తప్పుడు దిశలో వెళ్తోందని అన్నారు. మీరు పది గంటలు పని చేసినా, ఎలాంటి అవుట్ పుట్ ఇచ్చారనేదే ముఖ్యం అన్నారు.


ఎల్​ అండ్ టీ ఛైర్మన్‌ వ్యాఖ్యలపై - ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ పని గంటలు ఉన్నంత మాత్రాన ఉత్పాదకత గొప్పగా ఉండదని, ప్రతి మనిషికి కుటుంబం, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని గుర్తుచేశారు. ఇక, బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె కూడా సుబ్రమణియన్ వ్యాఖ్యాలపై అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూసి ఆశ్చర్యానికి గురయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..


Viral Video: స్వర్గంలో ప్రయాణం.. 4 వేల కి.మీ. జర్నీ.. రూ. 1.5 లక్షల టిక్కెట్.. ఎక్కడో తెలుసా?


Optical Illusion Test: వర్షం పడుతోంది.. ఈ పిల్లల గొడుగు ఎక్కడుందో 5 సెకెన్లలో గుర్తించి చెప్పండి..


Viral News: ఇదేందయ్యా.. ఇదీ.. ఎక్కడా వినలేదే.. ఈ వ్యక్తికి ఎందుకు ఫైన్ వేశారో తెలిస్తే షాకవ్వడం ఖాయం..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2025 | 12:23 PM