Viral Video: తమ్ముడూ.. చలి కాదు, తేడా వస్తే ప్రాణాలే పోతాయ్.. వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన..
ABN , Publish Date - Jan 11 , 2025 | 09:55 AM
చలి బారి నుంచి బయటపడేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చలి మంటలు వేసుకుంటారు, ఉన్ని దుస్తులు ధరిస్తారు, ఇంట్లో హీటర్లు వంటివి పెట్టుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు చలి నుంచి కాపాడుకునేందుకు ఓ ప్రమాదకర ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రస్తుతం మన దేశంలో చలి (Cold) విజృంభిస్తోంది. పగటి పూట కూడా వణికించేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన చలి తీవ్రత (Winter) ఎక్కువగా ఉంది. చలి బారి నుంచి బయటపడేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చలి మంటలు వేసుకుంటారు, ఉన్ని దుస్తులు ధరిస్తారు, ఇంట్లో హీటర్లు వంటివి పెట్టుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు చలి నుంచి కాపాడుకునేందుకు ఓ ప్రమాదకర ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
skammuu అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు ఓ బేసిన్‌లో కర్రలు వేసి మంట (Fire) పెట్టాడు. దానిని బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లాడు. డబుల్ కాట్ మంచం మీద చెక్కను పైకి లేపి లోపల ఆ మంటను పెట్టాడు. ఆ తర్వాత దానిపై మళ్లీ చెక్కను పెట్టేసి దుప్పటి కప్పుకుని పడుక్కున్నాడు. అది ఎంత ప్రమాదకరమో తెలిసిందే. మంట ఏ మాత్రం పెద్దదైనా ఇల్లంతా కాలిపోవడం ఖాయం. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చేసింది మాత్రమే అని అర్థమవుతోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. ఐదు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నిజంగా మూర్ఖత్వం``, ``ఇది వ్యూస్ కోసం చేసిందే, ఎవరైనా దీనిని ఫాలో అయితే మాత్రం పెద్ద ప్రమాదం తప్పదు``, ``ఇది ఫూలిష్‌నెస్``, ``ఇది చాలా ప్రమాదకరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Electricity Bill: కరెంట్ బిల్లు చూసి షాక్.. ఏకంగా రూ.200 కోట్లు రావడంతో యజమాని పరిస్థితి ఏంటంటే..
Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..
Viral Video: ఏనుగును చూసి కుక్క మొరిగితే ఏమవుతుంది? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..
Starbucks: స్టార్‌బక్స్ లోగో ఏంటో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి