Viral News: మాజీ భర్త మృతి.. మహిళ చేసిన వింత పనికి అంతా షాక్.. బాబోయ్..
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:03 PM
చైనాలో వాంగ్ అనే వ్యక్తి ఓ మహిళను 2022లో పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిపాటు వాళ్లిద్దరూ సంతోషంగా గడిపారు. వివిధ ప్రదేశాలు తిరిగి నూతన జీవితాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత మెల్లిగా వారి మధ్య వివాదాలు రావడం మెుదలైంది. అవి కాస్త రోజురోజుకూ పెరిగిపోవడంతో పలుమార్లు ఘర్షణకు సైతం దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహం చేసుకున్న ఓ జంట కొన్నేళ్లపాటు సంతోషంగా గడిపారు. మనస్పర్థలు రావడంతో పరిస్థితులు మెుత్తం తల్లకిందులు అయ్యాయి. మాకొద్దంటే మాకొద్దనుకుని ఇద్దరూ విడిపోయారు. ఏళ్లు గడిచిన తర్వాత సడెన్‌గా సదరు మహిళకు భర్త గుర్తొచ్చాడు. ప్రమాదవశాత్తూ అతను మరణించడంతో ఆ మహిళ కొత్త నాటకానికి తెరతీసింది. దీంతో ఆమె చేసిన పని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చైనాలో వాంగ్ అనే వ్యక్తి ఓ మహిళను 2022లో పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిపాటు వాళ్లిద్దరూ సంతోషంగా గడిపారు. వివిధ ప్రదేశాలు తిరిగి నూతన జీవితాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత మెల్లిగా వారి మధ్య వివాదాలు రావడం మెుదలైంది. అవి కాస్త రోజురోజుకూ పెరిగిపోవడంతో పలుమార్లు ఘర్షణకు సైతం దిగారు. దాంపత్య జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ దానికి ఫుల్‌స్టాప్ పెడదామని నిర్ణయించుకున్నారు. అనుకున్నడే తడవుగా కోర్టుకు మెట్లు ఎక్కారు. వారిద్దరూ కలిసి ఉండలేరని తేల్చిన అక్కడి కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో ఇద్దరూ మళ్లీ కొత్త జీవితాలను ప్రారంభించారు.
ఒంటరిగా జీవిస్తున్న వాంగ్‌కు 2023లో లియు అనే యువతి పరిచయం అయ్యింది. పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ సంతోషంగా గడపడం మెుదలుపెట్టారు. అలా ఏడాదిపాటు వారి ప్రేమకు హద్దులు లేకుండా పోయాయి. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వాంగ్, లియు మధ్య మనస్పర్థలు రాడవంతో అతనితో ఉండేందుకు ఆమె ఇష్టపడలేదు. ఇదే విషయం మాట్లాడేందుకు ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‍కు వెళ్లారు. అక్కడ డిన్నర్ చేసిన తర్వాత కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. కారును లియు నడుపుతుండగా.. ఆమె పక్క సీటులో వాంగ్ కూర్చున్నాడు. ఈ సందర్భంగా విడిపోవాలనే చర్చ వారి మధ్య వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, అదే సమయంలో ప్రమాదశాత్తూ ప్రయాణిస్తున్న కారు నుంచి వాంగ్ పడిపోయాడు.
వాంగ్ ప్రమాదానికి గురికావడంతో లియు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. వాంగ్ మెదడుకు బలమైన గాయం కావడంతో చికిత్సపొందుతూ 24 గంటల తర్వాత మృతిచెందాడు. వాంగ్ మృతితో అతని మాజీ భార్య కొత్త నాటకానికి తెరతీసింది. వాంగ్ మరణ వార్త తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మృతికి లియునే కారణమని ఆరోపించింది. వాంగ్‌ను హత్య చేసినందుకు గానూ లియు 6 లక్షల యువాన్లు(సుమారు రూ. 70.36 లక్షలు) ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. విడాకులు తీసుకున్న భార్యకు ఎలాంటి అధికారాలు ఉండవు కదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ విచారణ చేసిన పోలీసులు.. వాంగ్ చనిపోవడానికి లియు కారణం కాదని తేల్చారు. వాంగ్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే కిందపడి మృతిచెందాడని తెలిపారు. దీంతో సదరు మహిళ అత్యాశను చూసి చైనా ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఈ వార్త కాస్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.