Share News

China Viral News: విమానంలో నాకు సూది గుచ్చుకుంది.. నష్ట పరిహారం ఇవ్వండి.. ఎయిర్‌లైన్స్‌పై దావా..

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:04 PM

విమానంలో తోటి ప్రయాణికుల ప్రవర్తన, సిబ్బంది అందించే సౌకర్యాల్లో లోపాలు, ఆహారం మొదలైన విషయాల్లో చాలా మంది ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ వ్యక్తి తాజాగా చేసిన ఫిర్యాదు మరింత విచిత్రంగా ఉంది.

China Viral News: విమానంలో నాకు సూది గుచ్చుకుంది.. నష్ట పరిహారం ఇవ్వండి.. ఎయిర్‌లైన్స్‌పై దావా..
China Southern Airlines

ఇతర రావాణా మార్గాల ద్వారా ప్రయాణించే వారి కంటే విమాన ప్రయాణాలు (Flight Journey) చేసే వారి నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి. విమానంలో తోటి ప్రయాణికుల ప్రవర్తన, సిబ్బంది అందించే సౌకర్యాల్లో లోపాలు, ఆహారం మొదలైన విషయాల్లో చాలా మంది ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే చైనా (China)కు చెందిన ఓ వ్యక్తి తాజాగా చేసిన ఫిర్యాదు మరింత విచిత్రంగా ఉంది. చైనాకు చెందిన ఫు అనే ప్రయాణికుడు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అతడికి సూది గుచ్చుకుందట. దీంతో అతడు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడట. దీంతో అతడు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ఎయిర్‌లైన్స్‌పై దావా వేశాడు (Viral News).


చైనాకు చెందిన ఫు అనే వ్యక్తి ఇటీవల చైనా సదరన్ ఎయిర్‌లైన్స్‌ (China Southern Airlines)కు చెందిన విమానంలో ప్రయాణించాడు. అతడికి కేటాయించిన సీటులో వాడేసిన సిరంజి ఉంది. దానిని చూసుకోకుండా అతను కూర్చున్నాడు. బ్యాక్ పాకెట్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడికి ఆ సూది గుచ్చుకుంది. అది ఇన్సులిన్ ఇంజక్షన్‌కు సంబంధించిన సూది అని గమనించి వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. సిబ్బంది వెంటనే అతడి చేతికి తగిలిన గాయానికి ప్రాథమిక చికిత్స చేశారు. అతడు విమానం దిగే సమయంలో టికెట్ డబ్బులను వాపస్ ఇవ్వకుండా కాకుండా, అదనంగా మరికొంత మొత్తాన్ని కూడా ఇచ్చారు.


ఆ ఘటన ద్వారా తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, భవిష్యత్తులో చికిత్సకు అవసరమయ్యే ఖర్చు (రూ.15 లక్షలు)ను కూడా భరించాలని సంస్థను డిమాండ్ చేశాడు. అందుకు సదరు సంస్థ నిరాకరించింది. దాంతో అతడు కోర్టులో దావా వేశాడు. ఆ దావా అనంతరం సదరు సంస్థ అతడి డిమాండ్లకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీది నిజంగా షార్ప్ బ్రెయిన్ అయితే.. ఈ ఫొటోలో తాబేలు ఎక్కడుందో కనుక్కోండి..

Pakistan Viral Video: వీళ్లను చూశారా? ఎంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారో.. బైక్‌ను రిక్షాలా మార్చేశారు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..

Updated Date - Mar 09 , 2025 | 04:04 PM