Lovers: లవ్.. బ్రేకప్.. ఇదే జీవితం కాదు..
ABN , Publish Date - Mar 26 , 2025 | 08:27 AM
వాట్సాప్, ట్విటర్లో, ఇన్‌స్ట్రాగ్రాంలో ఛాటింగ్‌తో మొదలైన ప్రేమ నిజజీవితంలోకి వచ్చేసరికి పర్కవుట్ కాక వీడిపోతారు కొందరు. మరి కొంతమంది పరిస్థితులు అనుకూలించక వాళ్ల ప్రేమ దారులు మార్చుకుంటున్నారు. తరాలు మారే కొద్దీ ప్రేమలో వైఫల్యాలు పెరుగుతూనే వస్తున్నాయి. మిలీనియం జనరేషన్‌లో ప్రేమలో గెలిచిన వాళ్లకంటే ఓడిన ఎక్కువగా కనిపిస్తున్నారు.

Love Breakup: ప్రస్తుత రోజుల్లో ప్రేమ (Love) చాలా కామన్ (Common) అయిపోయింది. పాఠశాల వయసు నుంచే ప్రేమ వ్యవహారాలు మొదలవుతున్నాయి. నిజాయితీగా ప్రేమించే వారు తమ లవ్ పార్ట్నర్ (Love Partner) దగ్గర ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అనుకుంటారు. దానికి తగ్గట్టే తమ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని తమ ప్రేయసి లేదా ప్రియుడితో పంచుకుంటారు. కానీ ప్రేమలో ఉన్నవారు చేసే కొన్ని తప్పులు (Mistakes) వారిని కోలుకోలేని దెబ్బ తీస్తాయి. ఇవి భవిష్యత్తు (Future)లో చాలా నష్టాన్ని కలిగిస్తాయి. తన లవర్ హ్యాండివ్వడంతో జీవితమే వ్యర్థమైందని బాధపడుతుంటారు కొంతమంది. ఇన్నాళ్లూ తానే తన ప్రాణం అంటూ తిరుగుతారు. ఇప్పుడు వేరే అమ్మాయితో కనిపించాడని బాధపడుతూ తన స్నేహితులతో తన బాధనంతా చెప్పుకుంటారు. ఇంకొంతమంది లోలోపల మథన పడతారు. జీవితమంతా కోల్పాయమని ఫీలవుతూ.. ఇక బతకలేరని బాధపడతారు.
Also Read..: పాపవినాశనంలో బోటింగ్‌పై వివాదం..
షార్ట్ ఫిలిం ప్రేమలు
వాట్సప్, ట్విటర్లో, ఇన్‌స్ట్రాగ్రాంలో ఛాటింగ్‌తో మొదలైన ప్రేమ నిజజీవితంలోకి వచ్చేసరికి పర్కవుట్ కాక వీడిపోతారు కొందరు. మరి కొంతమంది పరిస్థితులు అనుకూలించక వాళ్ల ప్రేమ దారులు మార్చుకుంటున్నారు. తరాలు మారే కొద్దీ ప్రేమలో వైఫల్యాలు పెరుగుతూ నే వస్తున్నాయి. మిలీనియం జనరేషన్ లో ప్రేమలో గెలిచిన వాళ్లకంటే ఓడిన ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్లని అడిగితే దానికి కారణం పరిస్థితులే అంటున్నారు. ప్రేమ షార్ట్ ఫిల్మ్ అయినా పర్లేదు కాని జీవితం షార్ట్ కాకూడదు. ప్రేమలో విఫలం అయ్యేవాళ్లు కొద్ది రోజుల ముందు నుంచే వాళ్ల బంధంలో వచ్చే మార్పులు గమనిస్తుంటారు. వాళ్లు మాన సికంగా దానికి ఎంత వరకూ బాధ్యులో వాళ్లే ఆలోచించుకుంటారు. ప్రేమలో కొంత దూరం ప్రయాణం చేశాక వాళ్ల అభిప్రాయాల్లో మార్పులు రావచ్చు. లేదా బేధాభిప్రాయాలు రావచ్చు దానికి కొన్ని కారణాలుంటాయి. అయితే ప్రేమలో ఉన్నవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు..
స్మార్ట్ ఫోన్ల వాడకం..
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వాడకం చాలా వేగంగా పెరిగిపోయింది. వయసులో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. అయితే ఈ ఫోన్ ఉన్న కారణంగా చాలామంది తప్పటడుగు వేస్తున్నారు. ఆకర్షణను ప్రేమ అనుకుని తమ లవ్ పార్ట్నర్ కోసం కొన్ని సార్లు న్యూడ్ ఫొటోలు సైతం ఎలాంటి సంకోచం లేకుండా పంపేస్తుంటారు. అయితే ఈ ఫొటోల కారణంగా ప్రమాదం ఉంటుంది. రిలేషన్‌లో ఉన్నప్పుడు ఎంతో ప్రేమ చూపించిన పార్ట్నర్ లవ్ బ్రేకప్ అయ్యాక ఆ న్యూడ్ ఫోటోలను అడ్డు పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం ఉంది. మొబైల్‌లో ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా, దేని గురించి అయినా సెర్చ్ చేసినా కొన్ని సార్లు మొబైల్ గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటాయి. అంటే మొబైల్‌లో ఫొటోలు సదరు సైట్లు, యాప్‌లకు వెళ్లిపోతాయి. దీనికారణంగా సైబర్ నేరాలు జరిగే అవకాశం కుడా ఉంటుంది.
బ్యాంక్ ఖాతా వివరాలు..
ప్రేమలో ఉన్నంత సేపు ఇక తామిద్దరం శాశ్వతంగా ఉంటామని అనుకుంటారు. ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దని కూడా అనుకుంటారు. ఈ కారణంగానే కొందరు తమ ఆర్థిక విషయాలను, బ్యాంక్ ఖాతా వివరాలను షేర్ చేసుకుంటారు. కానీ ఇలా బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పడం మంచిది కాదు. భవిష్యత్తులో ప్రేమికులు విడిపోతే బ్యాంక్ ఖాతా వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది.
కుటుంబ విషయాలు..
కష్టం, సుఖం, బాధ ఇవన్నీ మనసుకు దగ్గరగా ఉన్నవారి వద్ద పంచుకోవడం చాలా కామన్. కుటుంబంలో కలహాలు, గొడవలు, అభిప్రాయ బేధాలు, కుటుంబ సభ్యుల ప్రవర్తన మొదలైనవి షేర్ చేసుకోవడం మంచిది కాదు. ఒక వేళ ప్రేమలో విఫలమైతే ఆ తరువాత కుటుంబం గురించి షేర్ చేసుకున్న విషయాలు నోటి మాటగా బయటివాళ్ల వరకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. తమ కుటుంబాన్ని తామే అందరి దగ్గరా తగ్గించుకున్నట్టు అవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినాశ్ డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్
For More AP News and Telugu News