Share News

Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..

ABN , Publish Date - Jan 13 , 2025 | 09:43 AM

మంచి ప్రోటీన్లను అందించే సోయాతో చేసిన స్నాక్స్‌ను ముఖ్యంగా సోయా చాప్స్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. రోడ్డు పక్కన స్టాల్స్ నుంచి ఖరీదైన రెస్టారెంట్ల వరకు అందరూ సోయా చాప్స్‌ను విక్రయిస్తుంటారు. అయితే ఈ సోయా చాప్‌ని తయారు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?

Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..
soya chaaps making video

సోయా (Soya) మంచి ప్రోటీన్‌ను అందించే ఆహారం. శాకాహారులకు పన్నీర్, మష్రూమ్ తర్వాత మంచి ప్రోటీన్‌ను అందించే ఆహారం సోయా. అందుకే సోయాతో చేసిన స్నాక్స్‌ను ముఖ్యంగా సోయా చాప్స్‌ను (soya chaaps) చాలా మంది ఇష్టంగా తింటుంటారు. రోడ్డు పక్కన స్టాల్స్ నుంచి ఖరీదైన రెస్టారెంట్ల వరకు అందరూ సోయా చాప్స్‌ను విక్రయిస్తుంటారు. అయితే ఈ సోయా చాప్‌ని తయారు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? ఒకవేళ చూడకపోతే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సోయా చాప్ ఫ్యాక్టరీ మేకింగ్ వీడియో (soya chaaps making video)ను చూడండి. ఈ వీడియో చూస్తే ఇకపై సోయా చాప్స్‌ను తినడానికి కూడా భయపడతారేమో. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


foodiee_sahab అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఫ్యాక్టరీ లోపల చాలా మురికి వాతావరణంలో సోయా చాప్‌ను తయారు చేస్తున్నారు. తయారు చేసే ప్రాంతం మొత్తం దుమ్ము, ధూళితో నిండి ఉంది. సోయా చాప్‌ను తయారు చేసే ఫ్యాక్టరీ కార్మికులు గ్లౌజులు ధరించడం గానీ, ఎలాంటి శుభ్రత పాటించడం గానీ చేయడం లేదు. ఓ వ్యక్తి మురికి కాళ్లతోనే సోయా బీన్ పిండిని తొక్కేస్తున్నాడు. ఆ కార్మికులు, ఆ పరిసరాలు, వాళ్లు వాడే పాత్రలు.. ఏవీ కనీస స్థాయిలో కూడా శుభ్రంగా లేవు. ఆ సోయా చాప్స్ మేకింగ్ వీడియోను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. `` సోయా చాప్‌ తయారీపై నిషేధం విధించాలి``, ``మన దేశంలో చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పరిస్థితి ఇంతకు మించి గొప్పగా`` ఉండదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..


Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..


Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..


Viral Video: స్వర్గంలో ప్రయాణం.. 4 వేల కి.మీ. జర్నీ.. రూ. 1.5 లక్షల టిక్కెట్.. ఎక్కడో తెలుసా?


Optical Illusion Test: వర్షం పడుతోంది.. ఈ పిల్లల గొడుగు ఎక్కడుందో 5 సెకెన్లలో గుర్తించి చెప్పండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2025 | 09:43 AM