Share News

Starbucks: స్టార్‌బక్స్ లోగో ఏంటో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటంటే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:56 PM

అమెరికన్ కంపెనీలు లోగో విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాయి. ప్రసిద్ధ అమెరికన్ బహుళజాతి సంస్థల మాదిరిగానే, స్టార్‌బక్స్ లోగో కూడా ప్రపంచంలో అత్యంత గుర్తించదగిన వాటిలో ఒకటి. అయితే దాని చరిత్ర గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.

Starbucks: స్టార్‌బక్స్ లోగో ఏంటో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటంటే..
Starbucks Logo

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక బడా వ్యాపార సంస్థలు తమ లోగో విషయంలో ఏన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. తమ ఉత్పత్తికి, లోగోకు సంబంధం ఉండేలా ఆసక్తికరంగా తీర్చిద్దిద్దుతాయి. ముఖ్యంగా అమెరికన్ కంపెనీలు లోగో విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాయి. ప్రసిద్ధ అమెరికన్ బహుళజాతి సంస్థల మాదిరిగానే, స్టార్‌బక్స్ (Starbucks) లోగో కూడా ప్రపంచంలో అత్యంత గుర్తించదగిన వాటిలో ఒకటి. అయితే దాని చరిత్ర గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. ఐకానిక్ కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్‌బక్స్ లోగో‌ ఒక మత్స్య కన్య రూపం (Starbucks Logo).


ఈ సైరన్ మూలాలు భయంకర చరిత్రను కలిగి ఉన్నాయి. స్టార్‌బక్స్ వ్యవస్థాపకులలో ఒకరైన గోర్డాన్ బౌకర్ స్నేహితుడు, సృజనాత్మక భాగస్వామి అయిన ఆర్టిస్ట్ టెర్రీ హెక్లర్ ఈ లోగోను 1971లో రూపొందించారు. ఈ లోగో విషయంలో పురాణాల నుంచి స్ఫూర్తి పొందారట. సముద్రంపై ప్రయాణించే నావికులను ఆకర్షించి వారి మరణానికి కారణమయ్యే అందమైన మార్మిక మత్స్యకన్య వేషధారణ ఆధారంగా స్టార్‌బక్స్ లోగోను రూపొందించారట. 1971లో రూపొందించిన ఈ లోగోను అనేక సార్లు ఆధునీకరించినప్పటికీ మూలం మాత్రం అప్పటిదే. లోగో మీద అమ్మాయి లాగానే ఈ కాఫీ అందర్నీ ఆకర్షిస్తుందన్నమాట.


``అమె మనోహరమైనది, నిగూఢమైనది, మనల్ని ఆకర్షించే కాఫీ కప్ వైపు మనల్ని ఆకర్షించే సరైన రూపకం`` అంటూ స్టార్‌బక్స్ వెబ్‌సైట్‌లో ఆ లోగో గురించి వర్ణన ఉంది. సముద్రంలోని మత్స్య కన్యను లోగోగా స్టార్‌బక్స్ పెట్టుకుందని అందరూ అనుకుంటున్నారని, దాని వెనుక చాలా లోతైన కారణం ఉందని యూట్యూబర్ జాక్ డిఫిల్స్ వివరించాడు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితే.. ఈ పక్షుల మధ్యనున్న ఊసరవెల్లిని 9 సెకెన్లలో గుర్తించండి..


Viral Video: ఈ ఏనుగు ఎంత మంచిది.. ఎన్‌క్లోజర్‌లో కుర్రాడి చెప్పు పడిపోతే ఏం చేసిందో చూడండి..


Viral Video: వావ్.. ఎలన్ మస్క్‌కు పోటీ ఇచ్చేలా ఉన్నాడు కదా.. నీటి మీద వేగంగా వెళ్తున్న ఈ వాహనాన్ని చూశారా?


Viral Video: వామ్మో.. ఇలాంటి వాళ్లు మన దేశంలోనే ఉన్నారా? బైక్‌ను ఏటీఎమ్ మెషిన్‌లో ఎలా మార్చాడో చూడండి..


Brain Teaser Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మూడు తప్పులను 9 సెకెన్లలో గుర్తించండి..

Optical Illusion Test: మీది హె‌చ్‌డీ చూపు అయితే.. ఈ నాలుగింటిలో భిన్నమైన చేపను 5 సెకెన్లలో గుర్తించండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 10 , 2025 | 04:27 PM