Share News

Financial Benefits of Marriage: పెళ్లి చేసుకుంటే కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఇవే

ABN , Publish Date - Apr 01 , 2025 | 08:13 AM

పెళ్లితో ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Financial Benefits of Marriage: పెళ్లి చేసుకుంటే కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఇవే
Financial Benefits of Marriage

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక కాలంలో వివాహ వ్యవస్థ కూడా మార్పులకు లోనవుతోంది. అయితే, ఈ వ్యవస్థకు సమాజంలో ఉన్న విలువ మాత్రం తగ్గలేదు. పెళ్లితో సామాజిక భద్రత లభించడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పన్ను చెల్లించే భార్యాభర్తలకు చట్టాల్లో కొన్ని ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. వీటి సాయంతో డబ్బును పొదుపు చేసుకోవచ్చు.

పెళ్లైన వారు తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందొచ్చు. పెళ్లైన జంటలను కంపెనీలు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా పరిగణిస్తాయి.

ఇక జీవిత భాగస్వామి ఇంటి బాగోగులకు తమ మొత్తం సమయం కేటాయిస్తే పిల్లల పెంపకం, ఖర్చుల గురించి ఆందోళన కూడా ఉండదు.


Also Read: గూగుల్‌లో వీటిని అస్సలు వెతకొద్దు.. చిక్కుల్లో పడతారు

భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంటిలోన్‌కు అప్లై చేస్తే త్వరగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంపాదనపరులైన భార్యాభర్తలు ఇద్దరూ ఇంటి ఖర్చులను సమానంగా పంచుకోవచ్చు. దీంతో, ఆర్థికభారం తగ్గి భవిష్యత్తు భద్రత కోసం పక్కా ప్రణాళికలు వేసుకునే వెసులుబాటు దక్కుతుంది.

పెళ్లైన వారికి కంపెనీల్లో కూడా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. వివాహితులను కంపెనీలు విశ్వసనీయులుగా భావిస్తాయి. సడెన్‌గా మానేయడం లేదా షికార్లకు వెల్లడం వంటి ఇష్టారీతి చర్యలకు వివాహితులు దిగరని సంస్థలు నమ్ముతాయి. మాతృత్వ సెలవులు కూడా సులువుగా దక్కుతాయి.

పెళ్లైన జంటలు సంపన్నులుగా మారే అవకాశాలు ఎక్కువ. ఎన్నో అధ్యయనాల్లో ఈ అంశం స్పష్టంగా రుజువైంది. ఇక జాయింట్ అకౌంట్స్ మెయింటేన్ చేసే జంటలకు లోన్లు, బిల్లుల చెల్లింపుల్లో అదనపు ప్రయోజనాలు చేకూరతాయి.


Also Read: ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్

పెళ్లైన జంటలకు కంపెనీలు క్రెడిట్ కార్డును తక్కువ వడ్డీకే ఇస్తుంటాయి. భార్యాభర్తల ఇద్దరూ సంపాదనపరులైతే క్రెడిట్ కార్డు దక్కడం మరింత సులభం.

ఒంటరి వారికి ఎవరినైనా దత్తత తీసుకోవడం కొంచెం కష్టం. కానీ పెళ్లైన వారికి ఈ చిక్కులు ఉండవు.

అనారోగ్యంతో ఉన్న జీవిత భాగస్వామిని కోసం సెలవు పెట్టేందుకు కంపెనీలు ఈజీగానే అంగీకరిస్తాయి. జీతంతో కూడిన సెలవులు ఇస్తాయి.

భార్యాభర్తలిద్దరూ తమ బాధ్యతలను రెండోవారితో పంచుకోవడం ద్వారా ఆనందం వెల్లివిరుస్తుంది. జీవితం సాఫీగా సాగిపోతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెళ్లైన జంటలకు అనేకం ఉంటాయి. కెరీర్‌లో ఎదగాలన్న ఉత్సాహం పట్టుదల పెళ్లైన వారిలోనే ఎక్కువగా ఉంటుందని కూడా తేలింది. అప్పులను కలిసి తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది.

Also Read: విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..

Read Latest and Viral News

Updated Date - Apr 01 , 2025 | 08:13 AM