Share News

German Shepard Saves Owner: ఇందుకే కుక్కను పెంచుకోవాలనేది.. ఈ వీడియో చూస్తే షాకైపోవాల్సిందే

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:28 PM

యజమానినిపై దాడి చేయబోయిన ముగ్గురు దుండగులతో భీకంగా పోరాడిన ఓ జర్మన్ షెపర్డ్ కుక్క వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

German Shepard Saves Owner: ఇందుకే కుక్కను పెంచుకోవాలనేది.. ఈ వీడియో చూస్తే షాకైపోవాల్సిందే
German Shepard Saves Owner

ఇంటర్నెట్ డెస్క్: నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న దారుణమది. రెక్కీ చేసి మరీ నేరగాళ్లు ఒంటరి వాళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పెంపుడు కుక్క తోడు ఉంటే ఎంతటి రక్షణ ఉంటుందో తెలియజెప్పే ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. యజమాని కోసం ప్రాణాలు తెగించిన ఈ కుక్కను చూసి జనాలు షాకైపోతున్నారు. తామూ ఓ కుక్కను పెంచుకుంటామంటూ వీడియో చూసిన అనేక మంది కామెంట్ చేశారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లో మోబీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. టంకరా మండలం మిటానా గ్రామంలో అమిత్ థేమా అనే రైతు నివసిస్తుంటాడు. స్థానికంగా జరిగే పెళ్లిళ్లకు గుర్రాలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు. అయితే, ఇటీవల అర్ధరాత్రి అతడి ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు జొరపడ్డారు. అతడిని చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించారు.


కంగారు పడిపోయిన అతడు పెరట్లోకి పరిగెత్తాడు. అక్కడి నుంచి గోడ దూకేందుకు ప్రయత్నించారు. అతడిని వెంబడిస్తూ వచ్చిన ఆగంతుకులు అమిత్‌ను పారిపోనీయకుండా అడ్డుకుని మళ్లీ చావబాదేందుకు ప్రయత్నించారు. ఈలోపు అక్కడే కట్టేసి ఉన్న పెంపుడు కుక్క ఆ ముగ్గురు దుండులతో పోరాటానికి దిగింది. యజమానిపై ఒక్క దెబ్బ కూడా పడనీయకుండా దుండగులకు చుక్కలు చూపించింది.

శునకం పోరాటం చూడగానే అమిత్‌కు ఊపిరి వచ్చింది. దాని కట్లు విప్పతిస్తే దుండగుల తాట తీస్తుందని బావించిన అతడు అలాగే చేశాడు. కట్లు విడివడగానే రెచ్చిపోయిన కుక్క వారిపై దాడికి దిగింది. దీంతో బెంబేలెత్తిపోయిన దుండగులు అక్కడి నుంచి జారుకున్నారు.


పెళ్లి వేడుకలకు గుర్రాలను ఏర్పాటు చేసిన సందర్భంగా వివాదం తలెత్తి ఎవరైనా అమిత్‌పై దాడికి ప్రయత్నించి ఉంటారని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మరో వైపు యజమానికి కాపాడిన కుక్కను స్థానికులు హీరోలా చేస్తున్నారు. అమిత్ కూడా తన కుక్కకు సంబంధించి అనేక ఫొటోలు వీడియోలను నెట్టింట పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో వింత రేసు.. వీర్య కణాల మధ్య పరుగుపందెం.. భారీ స్థాయిలో ఏర్పాట్లు

జాబ్‌‌లో మజా లేదని యువతి రాజీనామా.. షాక్‌లో సంస్థ యజమాని

ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..

Read Latest and Viral News

Updated Date - Apr 18 , 2025 | 04:29 PM