Share News

Viral: ఏఐ సాయంతో 19 ఏళ్ల మర్డర్ మిస్టరినీ ఛేదించిన కేరళ పోలీసులు

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:37 PM

ఓ మహిళ ఆమె నవజాత కవలలను దారుణంగా అంతమొందించిన నిందితులను దాదాపు 19 ఏళ్ల తరువాత పోలీసులు అరెస్టు చేశారు. పాత ఫొటోలను ఏఐ సాయంతో విశ్లేషించి వయసు ముదిరాక వారు ఎలా ఉంటారో చెప్పే ఊహాజనిత చిత్రాలను సృష్టించారు. ఈ ఫోటులు, నిందితుడి ప్రస్తుతం ఫొటో 90 శాతం ఒకేలా ఉండటంతో వీటి ఆధారంగా నిందితుల జాడ కనుక్కోగలిగారు.

Viral: ఏఐ సాయంతో 19 ఏళ్ల మర్డర్ మిస్టరినీ ఛేదించిన కేరళ పోలీసులు

ఇంటర్నెట్ డెస్క్: అన్ని రంగాల్లో విస్తరిస్తున్న ఏఐ ఇప్పుడు పోలీసులకు దర్యాప్తులో కీలకంగా మారుతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా కేరళలో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు ఏఐ సాయంతో 19 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని ఛేదించారు. మారు పేర్లతో గుట్టుచప్పుడు కాకుండా బతికేస్తున్న హంతకులను దొరకబుచ్చుకుని బాధితులకు న్యాయం దక్కేలా చేశారు (Viral).

పూర్తి వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలోని ఆంచల్ టౌన్‌కు చెందిన ఓ రంజని, ఆమె నవజాత కవలలు దారుణ హత్యకు 2006లో గురయ్యారు. ఆమె బిడ్డలకు తండ్రైన వ్యక్తి, మరో స్నేహితుడితో కలిసి వారిని అడ్డుతొలగించుకున్నాడు. రంజితకు అంతకుముందు అదే ప్రాంతానికి చెందిన దివిల్ కుమార్‌తో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలియగానే అతడు ఆమెను దూరం పెట్టసాగాడు.

Viral: ఇంట్లో ఒంటరిగా 38 ఏళ్ల మహిళ! చోరీకొచ్చిన దొంగ ఊహించని విధంగా..


మిలిటరీలో పనిచేస్తున్న అతడు పఠాన్‌కోట్‌కు వెళ్లిపోయాడు. అయితే, డెలివరీ తరువాత బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. దివిల్ కుటుంబం తనపై వేసిన అపవాదును పోగొట్టుకునేందుకు అతడు డీఎన్‌ఏ టెస్టుకు ముందుకొచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలికి అనుకూలంగా కమిషన్ తీర్పు వెలువరించింది.

ఇది సుతరామూ నచ్చని దవిల్ తన స్నేహితుడు రాజేశ్‌ను రంగంలోకి దింపాడు. రంజనిని కలిసిన రాజేశ్ తనని తాను అనిల్ కుమార్‌గా పరి చేసుకున్నాడు. ఆమెకు అండగా ఉంటానంటూ బాధితురాలి నమ్మకం చూరగొన్నారు. ఈ క్రమంలోనే 2006 ఫిబ్రవరి 7న రంజని తల్లికి ఏదో పని అప్పగించి స్థానిక పంచాయతీ ఆఫీసుకు పంపించాడు. ఇదే అదనుగా రంజనిని, ఆమె బిడ్డలను కడతేర్చాడు. ఆ తరువాత అక్కడి నుంచి జారుకున్నాడు.

Viral: డాక్టర్లు కడుపులో సూది వదిలిపెట్టడంతో గర్భస్థ శిశువుకు గాయాలు.. బాధితురాలి సంచలన ఆరోపణలు


కాగా, ఘటనాస్థలంలో పోలీసులకు ఓ ద్విచక్రవాహనం లభించింది. ఇది పఠాన్‌కోట్‌లో రిజిస్టరై ఉందని తేలడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. అయితే, నిందితులు మాత్రం అప్పటికే పారిపోయారు. మారు పేర్లతో కొత్త జీవితం ప్రారంభించారు. ఇంటీరియర్‌ డిజైనర్లుగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ పెళ్లికి సంబంధించి ఫొటో పోలీసుల దృష్టిలో పడింది. ఫొటోలోని వ్యక్తి ప్రవీన్ అని, అతడు పుదుచ్చేరిలో ఉంటాడని గుర్తించారు. ఈలోపు, నిందితుల పాత ఫొటోలను ఏఐ సాయంతో విశ్లేషించారు. 19 ఏళ్ల తరువాత నిందితులు ఎలా ఉంటారో ఊహించి ఏఐ కొత్త చిత్రాలను రూపొందించింది. ఈ ఫొటోల్లో ఒకదానికి ప్రవీన్ ఫొటోకు మధ్య సారూప్యత ఏకంగా 90 శాతం ఉండంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను చేజిక్కించుకున్నారు. నిందితులు తమ పేర్లను విష్ణు, ప్రవీన్ కుమార్‌గా మార్చుకున్నట్టు గుర్తించి జనవరి 5న అరెస్టు చేశారు.

Read Latest and Viral News

Updated Date - Jan 07 , 2025 | 06:42 PM