Share News

Viral: బుద్ధిగా వెళ్తున్న ఏనుగును రెచ్చగొట్టాడు.. అంతలోనే

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:51 PM

Viral News: ఓ యువకుడు గున్న ఏనుగును రెచ్చగొట్టించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఏనుగుల గుంపు వెళ్తుండగా అందులో ఒక ఏనుగుల గుంపును ఓ యువకుడు కావాలని రెచ్చగొట్టాడు. దానికి దగ్గరగా వెళ్తూ చేతులు ఊపడం మొదలుపెట్టాడు.

Viral: బుద్ధిగా వెళ్తున్న ఏనుగును రెచ్చగొట్టాడు.. అంతలోనే
Elephant video

మూగజీవాలు ఎంత సైలెంట్‌గా ఉంటాయో.. రెచ్చగొడితే అంతే వైలెంట్‌గా మారిపోతాయి. వాటి జోలికి ఎవరై వస్తే అంతు చూసే దాకా వదలవు. గజరాజులు కూడా గుంపులుగా ఉన్నప్పుడు ఒకలా.. ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంటాయి. కానీ ఏనుగును ఎవరైనా రెచ్చగొడితే మాత్రం అంత ఈజీగా వదలిపెట్టదు. ఏనుగు జోలికి వెళ్లకపోవడమే బెటర్. కానీ ఓ యువకుడు మాత్రం బుద్ధిగా వెళ్తున్న ఏనుగు పట్ల విచిత్రంగా ప్రవర్తించాడు. ఏనుగుల గుంపులతో వెళ్తున్న ఓ ఏనుగును సదరు యువకుడు కావాలని రెచ్చగొట్టాడు. తన తోటి ఏనుగులతో వెళ్తుండగా ఓ యువకుడు దాని వెనక చేరి చిరాకితెత్తించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఏనుగు చేసిన పనికి పరుగులందుకున్నాడు యువకుడు. ఇంతకీ యువకుడు ఏం చేశాడు... ఏనుగు ఎందుకలా ప్రవర్తించిందో ఇప్పుడు చూద్దాం.


ఓ యువకుడు గున్న ఏనుగును రెచ్చగొట్టించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఘటనను ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇలాంటి తీరు సరికాదంటూ కామెంట్ చేశారు. ఓ ఏనుగుల గుంపు వెళ్తుండగా అందులో ఒక ఏనుగుల గుంపును ఓ యువకుడు కావాలని రెచ్చగొట్టాడు. దానికి దగ్గరగా వెళ్తూ చేతులు ఊపడం మొదలుపెట్టాడు. దీంతో తిక్కరేగిన ఏనుడు అతడి వెంట పడింది. కొంతదూరం వెళ్లాక ఆ ఏనుగు వెనుదిరిగింది. అయినా ఆ యువకుడు ఊరుకోకుండా మళ్లీ ఆ ఏనుగు దగ్గరకు వెళ్లి రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. మళ్లీ అతడి వెంటపడేందుకు ప్రయత్నించిన ఏనుగు.. కొద్దిసేపటికి వొదలేసి తన గుంపుతో కలిసి వెళ్లిపోయింది. ఈ వీడియోను పోస్టు చేసిన పర్వీన్ కాశ్వాన్ ఆ యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు యువకుడు కాబట్టి వేగంగా పరిగెడుతూ ఆ ఏనుగును రెచ్చగొట్టాడని.. కానీ అతని తీరుతో చిరాకు చెందిన ఏనుగు ఊరికే ఉండదని హెచ్చరించారు.


కొన్ని రోజుల తర్వాత అయినా సరే మనుషులు కనిపిస్తే ఆగ్రహంతో వ్యవహరిస్తుందన్నారు. సరదాల కోసం అడవి జంతువులను ఇలా చిరాకు పెట్టవద్దని పర్విన్ కాశ్వాన్ తన పోస్టులో స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. కాగా ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఏనుగును యువకుడు విసిగిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగును రెచ్చగొట్టిన యువకుడిపై మండిపడ్డారు. పొరపాటున ఆ ఏనుగు మరెవరిపైన అయినా దాడి చేస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో గుర్తించి యువకుడిని శిక్షించాలని, మరొకరు ఇలా వ్యవహరించకుండా చేయాలని కొందరు, యువకుడి తీరు చాలా దారుణమని.. అడవి జంతువుల పట్ల ఇలా ప్రవర్తిస్తారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

పందెం కోళ్లలో ఇన్ని రకాలున్నాయా..?

డీఎస్పీని బెదిరించిన జగన్..

Read Latest Pratyekam News And Telugu News

Updated Date - Jan 13 , 2025 | 03:59 PM