Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:16 PM
Cell Phone: చిన్న పిల్లలు సైతం సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోతున్నారు. వారు అన్నం తినాలంటే.. వారి చేతిలో సెల్ ఫోన్ పెడితే కానీ భోజనం చేయని పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ.. చిన్న పిల్లల వద్ద నుంచి సెల్ ఫోన్ దూరం చేయాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా.. పిల్లలు అతిగా సెల్ ఫోన్ వాడకం వల్ల.. వారి ఆరోగ్యం, చదువు, సామాజిక నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని సదరు అధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఓ అధ్యయనం ప్రకారం 8 నుంచి 12 ఏళ్ల పిల్లలు రోజుకు సగటున 4 నుంచి 6 గంటల స్క్రీన్ చూస్తు గడుపుతున్నారని 2021లో కామన్ సెన్స్ మీడియా తన సర్వేలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
వాటిలో ఒకటి..
తొలుత పిల్లలకు స్క్రీన్ టైమ్ పరిమితి విధించాల్సి ఉంటుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) సిఫార్సు మేరకు 6 నుంచి 12 ఏళ్ల పిల్లలు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే స్క్రీన్ టైమ్‌లో గడపాలి.ఈ నియమాన్ని కఠినంగా అమలు చేయగలిగితే.. పిల్లల అలవాట్లను సులవుగా మార్చవచ్చు. ఇంకా చెప్పాలంటే..ఉదాహరణకు భోజనం చేసేటప్పుడు, చదువుకునే సమయంలో సెల్ ఫోన్‌ను పిల్లలకు సాధ్యమైనంత దూరంగా ఉంచాల్సి ఉంటుంది.
రెండవది..
ఇక 70 శాతం మంది పిల్లలు.. తమ తల్లిదండ్రులను అనుకరిస్తారు. అంటే.. తల్లిదండ్రులు ఫోన్ వాడకాన్ని తగ్గించి.. వారి పిల్లలకు అధిక సమయం కేటాయించాల్సి ఉంది. అలా అయితే.. ఆ పిల్లలు సెల్ ఫోన్‌కు దూరంగా ఉంటారు. అంతేకాదు.. పిల్లలతో అధిక సమయం గడపుతూ.. వారితో ఆటలు ఆడడం, వారికి కథలు చెప్పడం వంటివి చెబితే.. పిల్లలు ఆటోమెటిక్‌గా సెల్ ఫోన్‌కు దూరంగా ఉంటారన్నది సుస్సష్టం.
మూడోవది..
దేశంలో దాదాపు 60 శాతం మంది పిల్లలు ఆటలు ఆడే సమయం తగ్గిపోయిందని.. అందువల్ల వారంతా ఫోన్‌పై ఆధారపడుతున్నారని ఓ నివేదిక స్పష్టం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. వారికి మంచి అలవాట్లు చేసుకునేలా ప్రోత్సహించాల్సి ఉంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. సాయంత్రం సమయంలో పార్క్‌లో ఆటలు,సైక్లింగ్,లేదా డ్రాయింగ్,సంగీతం వంటి వాటిలో వారిని ప్రోత్సహించడం చేయాలి. త ద్వారా వారిని ఫోన్ వినియోగానికి దూరంగా ఉంచ వచ్చు.
నాలుగవది..
ఫోన్‌లో యాప్ లాక్‌లు, పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్‌లను ఉపయోగించాలి. గూగుల్ ఫ్యామిలీ లింక్ వంటి యాప్‌లు పిల్లలు ఎంత సమయం ఫోన్ వాడుతున్నారో ట్రాక్ చేసి, నిర్దిష్ట యాప్‌లను బ్లాక్ చేసే సౌలభ్యాన్ని కల్పిస్తాయి. ఇక రాత్ వేళ ఫోన్‌ను పిల్లల గదిలో కాకుండా.. తల్లిదండ్రుల వద్ద ఉంచడం శ్రేయస్కరం.
మరోవైపు మొబైల్ వాడకం వల్ల కలిగే ప్రతికూలతలను పిల్లలకు వివరించాలి. సెల్ ఫోన్ అతిగా వినియోగించడం వల్ల కంటి సమస్యలతోపాటు నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం 40 శాతం అధికమని ఓ అధ్యాయనం స్పష్టం చేసింది. ఈ విషయాలను పిల్లలకు వివరించి.. సెల్ ఫోన్ బదులు ఆటలు, చదవుతోపాటు స్నేహితులతో సమయం గడపడం వల్ల కలిగే ప్రాముఖ్యతను పిల్లలకు ముందుగా వివరించాల్సి ఉంది.
పిల్లల ఆటలు, పాటల వల్ల వారి శారీరకంగానే కాదు.. మానసికంగా ఎదుగుతారనే భావన వారిలో కల్పించ గలగాలి. అలా అయితే సెల్ ఫోన్‌ను ఎంత వరకు వినియోగించుకో వచ్చు అనే అంశంపై పిల్లల్లో సైతం ఓ స్పష్టత వస్తుందన్నది సుస్పష్టం.