Share News

Viral Video: అడవిలో బర్త్ డే సెలబ్రేషన్.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:11 PM

తాజాగా ఓ కుర్రాడు తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం స్నేహితులతో కలిసి అడవికి వెళ్లాడు. అక్కడ వారి సమక్షంలో కేక్ కట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మాత్రం నవ్వాపుకోలేరు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: అడవిలో బర్త్ డే సెలబ్రేషన్.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..
Birth day celebration in the forest

ప్రస్తుతం చాలా మంది కుర్రాళ్లు తమ స్నేహితులతో కలిసి బర్త్ డే (Birthday) సెలబ్రేట్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. స్నేహితుల సమక్షంలో కేక్ కట్ (Cake cutting) చేసి పార్టీ చేసుకుంటున్నారు. కేక్ కటింగ్ కోసం రకరకాల స్థలాలను ఎంచుకుని స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ కుర్రాడు తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం స్నేహితులతో కలిసి అడవికి (Forest) వెళ్లాడు. అక్కడ వారి సమక్షంలో కేక్ కట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మాత్రం నవ్వాపుకోలేరు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@GaurangBhardwa1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బర్త్ డేను స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఓ రాయి మీద కేక్ పెట్టి స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేశాడు. అయితే కేక్ కట్ చేయగానే చెట్టు మీద నుంచి ఓ కోతి (Monkey) కిందకు దిగింది. క్షణాల్లో ఆ కేక్‌ను పట్టుకుని పారిపోయింది. అందరూ కేకలు వేస్తూ ఆ కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కోతి వేగంగా చెట్టు ఎక్కేసింది. దీంతో చేసేది లేక అందరూ నవ్వుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను తక్కువ వ్యవధిలోనే 63 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బర్త్ డే రోజు కోతికి కేక్ ఇవ్వడం మంచిదే``, ``కట్ చేసే వరకు ఆ కోతి వేచి ఉండడం గొప్ప విషయం``, ``బర్త్ డే బాయ్‌కు చిన్న ముక్క మిగిలిందిగా``, ``అసలైన పార్టీ చెట్టు మీద మొదలవుతుంది`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎంత అందమైన వీడియో.. మంచులో చిరుతపులుల ఆటలు చూడండి.. వీడియో వైరల్..


Viral Video: వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. మాటలను అర్థం చేసుకుని ఎలా రిప్లై ఇస్తోందో చూడండి..


Viral Video: ఇది మెగా స్టంట్.. ఇతడిలా ఎవరూ చేయలేరేమో.. బైక్‌ను గాల్లోకి లేపగానే ఏం జరిగిందో చూడండి..


Optical Illusion Test: మీది చురుకైన చూపు అయితే.. ఈ కుర్రాడి రెండో షూను 9 సెకెన్లలో గుర్తించండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2025 | 01:11 PM