Share News

Viral: జీతంలో 70 శాతం పొదుపు చేసి 34 ఏళ్లకే రిటైర్మెంట్! తరువాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 09:59 PM

స్కాట్‌లాండ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భయంకరమైన పొదుపుతో కొంత డబ్బు కూడబెట్టుకుని 34 ఏళ్లకే రిటైర్‌ అయ్యాడు. అప్పటి నిర్ణయం సరైనదో కాదో ఇటీవల అతడు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వైరల్‌గా మారాయి.

Viral: జీతంలో 70 శాతం పొదుపు చేసి 34 ఏళ్లకే రిటైర్మెంట్! తరువాత ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: 60 ఏళ్ల వరకూ ఉద్యోగం చేశాక రిటైర్ అవ్వాలనేది అందరికీ తెలిసిన ప్లాన్. ఉద్యోగవిరమణ తరువాత విహారయాత్రలు, తీర్థయాత్రలతో కాలం గడపాలనేది అనేక మంది అనుసరించే ప్రణాళిక. కానీ, కాలం మారుతోంది. జనాల ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వస్తోంది. వృద్ధాప్యంలో రిటైర్ అయ్యాక చేసేదేమీ ఉండదని భావిస్తున్న కొందరు యువత వీలైనంత డబ్బు పోగేసుకొని 30ల్లోనే రిటైర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ప్లాన్ చేసి అనుకున్నది సాధించిన ఓ సాఫ్ట్‌వేర్ తన అనుభవాన్ని తాజాగా నెట్టింట పంచుకున్నారు (Viral).

స్కాట్‌లాండ్‌కు చెందిన బ్రాండ్ గాంచ్ 2016లో 34 ఏళ్ల చిరుప్రాయంలోనే రిటైర్ అయ్యారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన భయంకర పొదుపు పాటించి చిన్న వయసులోనే రిటైర్ అయ్యేందుకు కావాల్సిన సొమ్మును కూడబెట్టుకున్నారు. చివరకు అనుకున్న ప్రకారం 30ల్లో ఉండగానే ఉద్యోగజీవితానికి గుడ్‌బై చెప్పేశారు.


Viral: చిరుత వేటకు జింక బలి.. షాక్‌లో మరో 7 జింకల మృత్యువాత

ఇన్నాళ్ల తరువాత ఇటీవల ఆయన తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నారు. తన నిర్ణయంపై విచారం లేనప్పటికీ రాక్షస పొదుపు కారణంగా తను, తన భార్య సంతోషానికి దూరమయ్యామని చెప్పుకొచ్చారు.

అప్పట్లో గాంచ్, తన భార్యతో కలిసి అడవికి సమీపంలో జీవించే వారు. అక్కడ దొరికే వాటితోనే తమ అవసరాలు తీర్చుకుంటూ జీతంలో ఏకంగా 70 శాతం వరకూ పొదుపు చేయగలిగే వారు. ఈ క్రమంలో చిన్న చిన్న ఆనందాలకు కూడా ఆ దంపతులు దూరమయ్యారు.

Viral: రిస్క్ అని తెలిసీ క్యాండీని గట్టిగా కొరికి దవడ విరగ్గొట్టుకున్న యువతి


‘‘20ల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లకుండా డబ్బు పొదుపు చేశాను. ఈ వయసులో అలా చేయలేను కదా. గతాన్ని తలుచుకుంటే ఎన్నో మధుర స్మృతులకు దైరమయ్యానన్న విచారం కలుగుతోంది’’ అని గాంచ్ చెప్పుకొచ్చారు. తనకు పిల్లలు పుట్టాక దృక్పథంలో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చారు. వారికి సౌకర్యవంతమైన జీవితం ఇచ్చేందుకు సొంత ఇల్లు కూడా కొన్నానని అన్నారు. సంతానంతో పాటు డీ విత్ జీరో అనే పుస్తకం కూడా తన ఆలోచనను మార్చిందని గాంచ్ చెప్పుకొచ్చారు. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ప్రయత్నిస్తూనే జీవితాన్ని ఆశ్వాదించాలని ఆ పుస్తకం చెబుతోందని వివరించారు. భవిష్యత్తును చూసి మరీ అంత భయపడకుండా వాస్తవాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నించాలని అన్నారు.

ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న

Read Latest and Viral News

Updated Date - Jan 05 , 2025 | 09:59 PM