Share News

Prevent Travel Sickness: ప్రయాణంలో వాంతులా.. ఇలా చేయండి చాలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:14 PM

Prevent Travel Sickness: ప్రయాణంలో వాంతులతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని చిట్కాలతో వాంతులను తగ్గించుకుని సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చు. అవేంటో చూద్దం.

Prevent Travel Sickness: ప్రయాణంలో వాంతులా.. ఇలా చేయండి చాలు
Prevent Travel Sickness

కొందరికి బస్సు, కారు ప్రయాణం పడదు. బస్సు, కారులో ప్రయాణించేటప్పుడు వాంతులు చేసుకుంటుంటారు. ఈ కారణంగా వారు ఎక్కడికైనా వెళ్లాలంటే భయపడిపోతుంటారు. అందరితో కలిసి సరదాగా వెళ్లాలని అనిపించినప్పటికీ వాంతుల భయంతో ప్రయాణాన్ని మానుకుంటారు. ఇలా కారు లేదా బస్సు ప్రయాణంలో వాంతులు చేసుకోవడాన్ని మోషన్ సిక్‌నెస్ అని అంటారు. అయితే కొన్ని చిట్కాలతో ఈ బాధ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా.. హ్యాపీగా ప్రయాణించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


సీటు ఎంపిక: కారులో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ పక్క సీటును ఎంచుకోవాలి. అలాగే బస్సులో ముందర సీట్లో కోర్చోవాలి. దీంతో ప్రయాణంలో కదలికలు తక్కువగా అనిపించి వాంతులు రాకుండా ఉంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఇది సమతుల్యతను కాపాడుతుంది.

గాలి తీసుకోవడం: ప్రయాణం చేసేటప్పుడు కిటకీని ఎల్లప్పుడూ తెరిచే ఉంచుకోవాలి. కారులో అయితే మొహానికి ఏసీ గాలి తగేలా చూసుకోవాలి. దీని వల్ల మెదడుకు ఆక్సీజన్ అందడంతో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఈ పద్ధతిని మాయో క్లినిక్ సిఫార్సు చేస్తుంది.

దూరంగా చూడటం: ప్రయాణం చేసేటప్పుడు చదవడం లేదా ఫోన్ చూడటం మానుకోవాలి. రోడ్డుపై స్థిరమైన బిందువును చూడాలి. ఇది కంటి, మెదడు సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ధృవీకరించింది.


ఆహారం విషయంలో: ప్రయాణం చేసే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. అంటే త్వరగా జీర్ణమయ్యే ఫుడ్‌ను మాత్రమే తీసుకోవాలి. నూనె, మసాలా వంటి వాటికి దూరంగా ఉండాలి. ఖాళీ కడుపు లేదా ఎక్కువ ఆహారం తీసుకోవడం వాంతులకు కారణమవుతాయని జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిస్ (2021) చెబుతోంది.

అల్లం: ప్రయాణంలో అల్లం ముక్కలను చప్పరించడం లేదా అల్లం టీ తాగితే వాంతులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అల్లం సహజ యాంటీ - నాసియా గుణాలను కలిగి ఉందని బ్రిటిషన్ మెడికల్ జర్నల్ (2022) చెబుతోంది.

సలహా: పైన చెప్పిన చిట్కాలు కూడా పనిచేయని పక్షంలో ప్రయాణానికి ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. యాంటీ - నాసియా మందులు వాడటం వల్ల ప్రయాణంలో అసౌకర్యం కలగకుండా ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

Hyderabad Explosion: హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఏం జరిగిందంటే

Read Latest Pratyekam News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 01:05 PM