Forbidden Google Searches: గూగుల్‌లో వీటిని అస్సలు వెతకొద్దు.. చిక్కుల్లో పడతారు
ABN , Publish Date - Apr 01 , 2025 | 07:49 AM
కొన్ని అంశాలను గూగుల్‌లో సెర్చి చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఒక్కోసారి జైలు శిక్ష కూడా పడొచ్చు. ఈ నిషిద్ధమైన సెర్చ్‌లు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే జనాలు లైబ్రరీకి వెళ్లేవారు. ఇతరులను అడిగి తెలుసుకునేవారు. కానీ, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజెన్‌ల రాకతో పరిస్థితి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఏ సమాచారాన్నైనా సెర్చి ఇంజెన్లు క్షణాల్లో మన కళ్లముందు ఉంచుతున్నాయి. అయితే, ఆన్‌లైన్‌లో ఏ సమాచారం వెతకొచ్చు అనే దానిపై కూడా కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటిని అతిక్రమిస్తే జైలు పాలవడం పక్కా. మరి ఆన్‌లైన్‌లో వెతకకూడని అంశాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మనసులో సందేహాల వల్లనో లేక కుతూహలం కొద్దో నిత్యం అనేక అంశాలను నెట్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాము. నెట్టింట ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌ను ఆశ్రయిస్తాము. అయితే, గూగుల్‌లో కొన్ని రకాల సమాచారం వెతికితే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఈ అంశాలు మీ సెర్చి హిస్టరీలో ఉంటే దెబ్బైపోయినట్టే..
Also Read: ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్
బాంబ్ తయారీ విధానాల కోసం గూగుల్‌లో వెతకడం నిషిద్ధం. ఇలాంటి సెర్చ్‌లను భద్రతా ఏజెన్సీలు నిత్యం ఓ కంట కనిపెడుతూ ఉంటాయి. పేలుడు పదార్థాలు, ఆయుధాల గురించి నెట్టింట వెతికితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి వ్యవహారం అరెస్టుల దాకా వెళుతుంది.
ఉచిత మూవీల కోసం చాలా మందికి ఆన్‌లైన్‌లో వెతికే అలవాటు ఉంటుంది. అయితే, మూవీ పైరసీ చట్టవ్యతిరేకం. ఈ నేరానికి పాల్పడిన వారికి శిక్షలు తప్పవు. జరిమానాలతో పాటు భారీ జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..
ఆన్‌లైన్‌లో హ్యాకింగ్ ట్యూటోరియల్స్, సాఫ్ట్‌వేర్ల గురించి వెతకడం కూడా చట్టవ్యతిరేకమే. ఇలాంటి సమాచారాన్ని సేకరించడం, జనాలతో పంచుకోవడం వంటివి చేస్తే జైలుపాలు కావాల్సి వస్తుంది.
ఇక అబార్షన్, చిన్నారులకు సంబంధించి అసభ్యకరమైన కంటెంట్ కోసం వెతికినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు వేస్తాయి. కాబట్టి, ఆన్‌లైన్ ప్రపంచంలో ఎలా నడుచుకోవాలో తెలుసుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావని సైబర్ నిపుణులు చెబుతున్నారు.