Pavel Stepchenko Retirement: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. రికార్డులు సృష్టించిన యువకుడు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 08:55 AM
రష్యాకు చెందిన పావెల్ స్టెప్చెంకో అనే యువకుడు తన 16 ఏట రష్యన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన విద్యా సంస్థలో చేరాడు. అక్కడే ఐదేళ్లపాటు విద్యాభ్యాసం చేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఎవరైనా కొంచెం అటుఇటుగా 60 ఏళ్ల వయస్సులో ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అవుతుంటారు. కానీ రష్యాకు చెందిన యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా అతి చిన్న వయస్సులోనే రిటైర్ అయ్యి హాట్ టాపిక్‌గా మారాడు. 23 ఏళ్లకే ఏకంగా పెన్షన్ తీసుకుని మరీ ఉద్యోగ విరమణ పొంది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. అతి చిన్న వయస్సులోనే రిటైర్ అయ్యి పలు రికార్డులు సైతం సృష్టించాడు. అతని గురించి తెలుసుకున్న వారంతా ఇదేలా సాధ్యమైందంటూ జుట్టు పీక్కుంటున్నారు. కాగా, ఆ యువకుడి గురించిన వార్త సోషల్ మీడియాను ఇప్పుడు షేక్ చేస్తోంది.
రష్యాకు చెందిన పావెల్ స్టెప్చెంకో అనే యువకుడు తన 16 ఏట రష్యన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన విద్యా సంస్థలో చేరాడు. అక్కడే ఐదేళ్లపాటు చదువుకున్న స్టెప్చెంకో విద్యాభ్యాసం పూర్తయ్యాక రష్యా అంతర్గత వ్యవహారాల వ్యవస్థకు చెందిన ప్రాదేశిక విభాగంలో ఉద్యోగం పొందాడు. అయితే అక్కడి చట్టాల ప్రకారం అతను ఓ ప్రత్యేక నిబంధన కింద ఉద్యోగంలో చేరాడు. ఆ నిబంధన ప్రకారం స్టెప్చెంకో అతి తక్కువ కాలంలోనే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.
ఈ కారణంగానే స్టెప్చెంకో 23 ఏళ్లకే రిటైర్ అయ్యాడు. చాలా మంది యువకులు తమ కెరీర్‌లను ప్రారంభించే వయస్సులోనే పూర్తి పెన్షన్‌తో స్టెప్చెంకో రిటైర్ అవ్వాల్సి వచ్చింది. 28, నవంబర్ 2023 నాటికి అతను పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాడు. ఆ సమయంలో అమలులో ఉన్న రష్యన్ ఫెడరేషన్ చట్టాల ప్రకారం పూర్తి పెన్షన్ పొందాడు. ఈ అసాధారణ రిటైర్మెంట్‌ను ఇంటర్నేషనల్ రికార్డ్ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ INTERRECORD నిపుణులు అధికారికంగా ధృవీకరించారు. అలాగే రష్యా రికార్డ్స్ రిజిస్టర్‌లోనూ స్టెప్చెంకో స్థానం సంపాదించాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Picture Puzzle: మీది నిజంగా హెచ్‌డీ చూపు అయితే.. ఈ గదిలో బ్రష్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
Danish tourists clean sikkim roads: భారతీయ వీధులు శుభ్రం చేసిన విదేశీ టూరిస్టులు!