Penguin Love Life: పెంగ్విన్‌లలో కూడా ప్రేమ, మోసం, విడాకులు.. వెలుగులోకి ఆశ్చర్యకర నిజాలు..
ABN , Publish Date - Jan 21 , 2025 | 02:55 PM
పెంగ్విన్లలో కూడా ప్రేమించడం, మోసపోవడం, విడిపోవడం మొదలైనవి ఉంటాయని తాజాగా ఓ అధ్యయనం సంచలన నివేదికను వెల్లడించింది. ఫిలిప్ ద్వీపంలో 13 సంతానోత్పత్తి సీజన్‌లలో పదేళ్ల పాటు ఈ అధ్యయనం జరిగింది. ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ప్రేమ, పెళ్లి, మోసం, గొడవలు, వివాహేతర సంబంధం, విడాకులు ఇవన్నీ మనుషుల్లోనే జరుగుతాయని ఇప్పటివరకు అనుకుంటున్నాం (Love Life). అయితే మనుషుల తరహాలోనే ఇవన్నీ పెంగ్విన్లలో (Penguins) కూడా జరుగుతున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. పెంగ్విన్లలో కూడా ప్రేమించడం, మోసపోవడం, విడిపోవడం మొదలైనవి ఉంటాయని తాజాగా ఓ అధ్యయనం సంచలన నివేదికను వెల్లడించింది. ఫిలిప్ ద్వీపంలో 13 సంతానోత్పత్తి సీజన్‌లలో పదేళ్ల పాటు ఈ అధ్యయనం జరిగింది. ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది (Viral News).
పెంగ్విన్లు కూడా ఒక దానినొకటి ప్రేమించుకుని కలిసి జీవిస్తాయట. అయితే ఒక మగ పెంగ్విన్ వేరే ఆడ పెంగ్విన్‌కు అకర్షితమైన విషయం తెలిస్తే.. దానితో అప్పటివరకు కలిసి ఉన్న ఆడ పెంగ్విన్ వెళ్లిపోతుందట. సాధారణ సమయాల్లో పెంగ్విన్లు తమ భాగస్వాములతో కలిసి జీవిస్తాయట. అయితే సంతానోత్పత్తి సమయాల్లో మాత్రం కొత్త భాగస్వామిని వెతుకుంటున్నాయట. నిరుత్సాహపూరిత శృంగార సంబంధాలు కూడా పెంగ్విన్ జంటలలో విడాకులకు ఒక కారణమని అధ్యయనకారులు కనుగొన్నారు. పది సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన వెయ్యి పెంగ్విన్ జంటలలో 250 జంటలు విడిపోయాయట. కొన్ని ఇతర పెంగ్విన్‌లు సింగిల్‌గా ఉండిపోయాయట.
సంతానోత్పత్తి సమయంలో తరచుగా భాగస్వాములను మార్చుతుండడం వల్ల పిల్లలకు సరైన ఆహారం దొరకడం లేదట. కొత్త సహచరుడి కోసం వెతుకుతూ సమయం వృధా చేయడం వల్ల పునరుత్పత్తి ప్రారంభం ఆలస్యం అవుతోందట. అలాగే కొత్త జంటలు గూళ్లు కట్టడం, గుడ్లు పొదిగించడం, పిల్లలను పెంచడంలో నైపుణ్యం సాధించలేకపోతున్నాయట.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..
Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..
Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి