Predictions for 2025: 2025 అత్యంత భయంకరంగా ఉండబోతోందా? బాబా వంగా, నోస్ట్రడామస్ అంచనాలు నిజమైతే..
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:26 AM
ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది. ప్రపంచ దిశ ఎలా ఉంటుంది. ప్రఖ్యాత జ్యోతిష్కులు అయిన నోస్ట్రడామస్, బాబా వంగా 2025 గురించి వెల్లడించిన అంచనాలను వింటే మాత్రం చెమటలు పట్టడం ఖాయం. 2025వ సంవత్సరం అత్యంత భయానకంగా ఉంటుందని ఇద్దరూ అంచనా వేశారు.
అందరూ ఎంతో సంతోషంగా, ఆశగా ఎదురుచూస్తున్న 2025వ సంవత్సరం వచ్చేసింది. ఎన్నో మంచి, చెడు అనుభవాలను చూపించిన 2024 కాల గర్భంలో కలిసిపోయింది. ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది? ప్రపంచ దిశ ఎలా ఉంటుంది. ప్రఖ్యాత జ్యోతిష్కులు అయిన నోస్ట్రడామస్ (Nostradamus), బాబా వంగా (Baba Vanga) 2025 గురించి వెల్లడించిన అంచనాలను వింటే మాత్రం చెమటలు పట్టడం ఖాయం. 2025వ సంవత్సరం అత్యంత భయానకంగా ఉంటుందని, ముఖ్యంగా యూరప్ ఖండం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని వారిద్దరూ అంచనా వేశారు. (Predictions for 2025)
బల్గేరియాకు చెందిన అంధురాలైన ఆధ్యాత్మికవేత్త బాబా వంగా 1996లో కన్ను మూశారు. ఈమె 9/11 దాడులు, యువరాణి డయానా మరణం , చెర్నోబిల్ విపత్తు వంటి ప్రధాన సంఘటనలను కచ్చితంగా ఊహించి వెల్లడించారు. ఈమెను ``నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్`` అని పిలుస్తుంటారు. ఈమె అంచనా ప్రకారం.. 2025లో యూరప్‌ను నాశనం చేసే వినాశకర యుద్ధం జరుగుతుంది. అలాగే అమెరికా పడమర తీరం వెంబడి భయంకర భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలతో పాటు పలు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఇక, ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా ఇదే తరహా అంచనాలను వెలువరించారు. ఈయన 16వ శతాబ్దంలోనే తన అంచనాలను వెల్లడించారు.
2025 సంవత్సరంలో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. ప్లేగు కారణంగా బ్రిటన్ నాశనాన్ని ఎదుర్కొంటుందని, అలాగే ఓ మహమ్మారి తిరిగి వస్తుందని నోస్ట్రడామస్ అంచనా వేశారు. అలాగే భయంకర సుదీర్ఘ యుద్ధం ఐరోపా దేశాలను, సైనికులను హరిస్తుందని ఆయన జోష్యం చెప్పారు. ప్రపంచంపై పాశ్చాత్య ఆధిపత్యం క్షీణించడంతో పాటు ప్రపంచ శక్తిలో మార్పును కూడా సూచించారు. ఐరోపా ఇప్పటికే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో పోరాడుతున్నందున ఈ అంచనాలు నిజం కావచ్చని చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు.
ఇక, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త అథోస్ సలోమ్ (Athos Salome) కూడా ఇదే తరహా అంచనాలను వెలువరించారు. ఈయన బ్రిటన్ రాణి మరణం, ఉక్రెయిన్-చైనా యుద్ధాన్ని ముందుగానే ఊహించి చెప్పారు. ఈయన ``లివింగ్ నోస్ట్రడామస్``గా పేరుపొందారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మనుషులు చేయి దాటి పోయి చాలా సమస్యలు ఎదురవుతాయని ఆయన చెబుతున్నారు. అలాగే 2025లో మనుషులకు గ్రహాంతర వాసులు అందుబాటులోకి వస్తారని, వారితో కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని అంచనా వేశారు. అలాగే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలను కూడా కొట్టి పారెయ్యలేమని అన్నారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..