Viral Video: ఇది మెగా స్టంట్.. ఇతడిలా ఎవరూ చేయలేరేమో.. బైక్‌ను గాల్లోకి లేపగానే ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jan 08 , 2025 | 08:11 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రమాదకర స్టంట్ వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టంట్ చూస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే. ఎందుకంటే బైక్‌ను గాల్లోకి లేపగానే వెనుక చక్రం ఊడిపోయింది.
మన దేశంలోనే కాదు, మిగతా దేశాల్లో కూడా యువతకు బైక్‌లు (Bikes) అంటే చాలా క్రేజ్. వేగంగా నడపడం మాత్రమే కాదు.. బైక్‌లతో రకరకాల స్టంట్‌లు (Bike stunts) చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రమాదకర స్టంట్ వీడియోలు (Bike stunt Videos) మన కళ్ల ముందుకు వచ్చాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టంట్ చూస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే. ఎందుకంటే బైక్‌ను గాల్లోకి లేపగానే వెనుక చక్రం (Bike Tyre) ఊడిపోయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).
@ThorPrasad అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పాత బైక్ మీద స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. బైక్ వెనుక భాగాన్ని గాల్లోకి లేపాడు. అయితే ఆ సమయంలో బైక్ వెనుక టైర్ ఊడిపోయి పక్కకు వెళ్లిపోయింది. దీంతో ఆ వ్యక్తి ఆ బైక్‌ను చాలా దూరం వరకు ముందు చక్రం మీదనే నడిపి అబ్బురపరిచాడు. అంతసేపు ముందు చక్రం మీదనే బైక్‌ను బ్యాలెన్స్ చేయడం సామాన్య విషయం కాదు. అతడి స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు సోషల్ మీడియాలో వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది వేరే వారు ఎవరూ చేయలేరు``, ``ఆ తర్వాత బైక్‌ను కిందకు ఎలా దించుతాడు``, ``అది చాలా కష్ట సాధ్యమైన స్టంట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీది చురుకైన చూపు అయితే.. ఈ కుర్రాడి రెండో షూను 9 సెకెన్లలో గుర్తించండి..
Brain Teaser Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మూడు తప్పులను 9 సెకెన్లలో గుర్తించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి