Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:48 PM
రైళ్లలో చిరుతిళ్లు అమ్ముకునే వారు కచ్చితంగా పేద వాళ్లే అయ్యుంటారు. ప్రయాణికులతో కిక్కిరిసిపోయే రైలు భోగీలన్నీ తిరుగుతూ ఎంతో కొంత సంపాదించుకోవాలని ఆశపడుతుంటారు. అయితే అలాంటి వారిని కూడా దోచుకునేందుకు కొందరు సిద్ధపడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

రైల్లో (Train) ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం రకరకాల చిరుతిళ్లను (Snacks) అమ్మేవారు ఎక్కుతుంటారు. అన్ని భోగీలు తిరిగి తమ దగ్గరున్న స్నాక్స్‌ను అమ్ముకుని ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఇలా రైళ్లలో అమ్ముకునే వారు కచ్చితంగా పేద వాళ్లే (poor) అయ్యుంటారు. ప్రయాణికులతో కిక్కిరిసిపోయే రైలు భోగీలన్నీ తిరుగుతూ ఎంతో కొంత సంపాదించుకోవాలని ఆశపడుతుంటారు. అయితే అలాంటి వారిని కూడా దోచుకునేందుకు కొందరు సిద్ధపడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@KantInEast అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రైలు జనరల్ కంపార్ట్‌మెంట్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. అలాంటి భోగీలోకి మూరీ మిక్చర్ అమ్ముకునే వ్యక్తి అతి కష్టం మీద ఎక్కాడు. అక్కడి వారికి అమ్ముకుందామని ప్రయత్నించాడు. అయితే పూర్తిగా కిక్కిరిసిపోయి ఉన్న ఈ భోగీలో ముందుకు వెళ్లడం అతడికి సాధ్యం కాలేదు. దాంతో చుట్టు పక్కల ఉన్న వారు డబ్బులు ఇవ్వకుండా, అన్యాయంగా అతడి దగ్గర ఉన్న మిక్చర్‌ను తీసేసుకుని పంచేసుకుని తినేశారు. అది చూసి ఆ భోగీలోని వారు నవ్వుకున్నారు.
వీడియో కోసం ఇక్కడ చూడండి
ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు 4 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 3.5 వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. పేద వాడిని కూడా దోచుకుంటారా``, ``దొంగతనం చేస్తున్న వారు తామేదో పవర్‌ఫుల్ అని ఫీల్ అవుతున్నారు``, ``నిజంగా వాళ్లు సిగ్గుపడాలి`` అని కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
Optical Illusion: ఈ ఫొటోలో మీకు గుర్రం కనబడితే.. మీరు సాధారణమైన వ్యక్తి కాదు.. ప్రయత్నించండి..
Online order: రూ.61 వేల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..