Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:42 PM
చాలా మంది తమ ట్యాలెంట్‌తో ఇతరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటారు. అలాంటి మట్టిలో మాణిక్యాల ప్రతిభ సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరుతోంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తుల వీడియోలు, ఫోటోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి.

ఈ ప్రపచంలోని ఎంతో మంది ప్రతిభావంతులు సాధారణ వ్యక్తుల్లా ఉండిపోతారు. చాలా మంది తమ ట్యాలెంట్ (Talent)తో ఇతరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటారు. అలాంటి మట్టిలో మాణిక్యాల ప్రతిభ సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరుతోంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తుల వీడియోలు, ఫోటోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక పిల్లవాడు తన నోటితో అనేక ఇటుకల (Bricks)ను ఒకేసారి ఎత్తడం కనిపిస్తోంది (Viral Video).
fun_factorss అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొన్ని ఇటుకలను ఒకదానిపై ఒకటి ఉంచినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ బాలుడు ఒకేసారి తన పళ్లతో మొత్తం ఇటుకలను పైకి ఎత్తేశాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పైన పెట్టిన ఒక్క ఇటుక కూడా కిందకు పడకుండా బ్యాలెన్స్ చేశారు. ఆ చిన్నారి ఫీట్‌ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోకు వేల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వందల కొద్దీ లైక్స్ వచ్చాయి. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇండియా కొత్త వారి కోసం``, ``ఆ కుర్రాడు రోజూ వేప పుల్లతో పళ్లు తోముకుంటున్నాడు``, ``ఈ కుర్రాడు బీహారీ అయ్యుంటాడు``, ``ఈ కుర్రాడు ఏ టూత్ పేస్ట్‌తో బ్రష్ చేసుకుంటున్నాడో తెలుసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..
Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..
Tiger Hunting video: మూడు పులి పిల్లలు, ఒక జింక.. ఆ వేట చివరకు ఎలా ముగిసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి