Ways to Keep Room Cool: ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:06 PM
ఏసీ లేకపోయినా ఈ టిప్స్ పాటిస్తే మీ ఇంటిలోపలి వాతావరణాన్ని చల్లబరుచుకోవచ్చు

ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలంలో నానాటికీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితులు వచ్చి పడుతున్నాయి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఏసీ లేకపోయినా ఇంట్లో చల్లని వాతావరణం సృష్టించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ టిప్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏసీ లేకపోయినా ఇంట్లో వాతావరణాన్ని చల్లబరిచేందుకు పలు మార్గాలు ఉన్నాయి. వీటిని ఎవరికి వారు నిపుణుల అవసరం లేకుండానే ప్రయత్నించొచ్చు.
కిచెన్ బాత్రూమ్‌లో ఉండే ఎగ్జాస్ట్ ఫాన్‌ను కాసేపు ఆన్ చేస్తే ఇంట్లోని వేడి గాలి బయటకు పోతుంది. అయితే, ఇతర విధానాలకు అనుబంధంగా మాత్రమే ఇవి ఉపయోగపడతాయి.
కిటికీ లేదా తలుపు దగ్గరు గోడకు తగిలించే ఆసిలేటింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకుంటే బయటి చల్లని గాలి లోపలకు సులువుగా వస్తుంది. దీంతో, ఇల్లు చల్లబడుతుంది. ఈ ఫ్యాను ముందర ఐస్ క్యూబ్స్ ఉన్న చిన్న గిన్నె ఏర్పాటు చేసినా కూడా ఇల్లు సులువుగా చల్లబడుతుంది.
Also Read: విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..
ఎండవేడి ఇంట్లోకి రాకుండా ఉండేందుకు సూర్యరశ్మిని అడ్డుకునే కర్టెన్ల వంటివాటిని ఏర్పాటు చేసుకోవాలి. దీంతో, ఇంట్లో వేడి ఏకంగా 40 శాతం వరకూ తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇన్సూలేటెడ్ కిటికీ అద్దాలతో ఇంటిలోని ఉష్ణోగ్రతలు పెరగకుండా జాగ్తత్త పడొచ్చు.
ఎండ వేళల్లో వంట పనికి కూడా విరామం ఇవ్వొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. గ్రిల్లింగ్ లాంటి పనులు ఇంటి బయట చేయడం వంటివాటితో కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలతో చేసు ఫుడ్స్, సలాడ్స్ వైపు మళ్లాలని సూచిస్తున్నారు. టోస్టర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, డ్రయ్యర్లు వంటివి ఈ కాలంలో వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
Also Read: ఏఐ జమానాలో అత్యధిక జీతాలు ఉన్న ఉద్యోగాలు ఇవే
ఎండాకాలంలో ఇన్‌కాండెసెంట్ బల్బుల వద్ద వేడి మరింత ఎక్కువవుతుంది. వీటి బదులుగా ఎల్‌ఈడీ లైట్లు వాడాలి. వీటితో వేడి చాలా వరకూ తగ్గిపోతుంది. వీలైనంత వరకూ లైట్‌లను ఆఫ్ చేసి ఉంచడం ద్వారా గదిలో వేడి పెరగకుండా జాగ్రత్త పడొచ్చు.
ఇంటి గదిలో నేలకు దగ్గరా ఉన్న గాలి చల్లగా ఉంటుంది. కాబట్టి నేలపై పడుకుంటే కూడా ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక గదిలోని తలుపులు కిటికీలు తెరిచి పెడితే కూడా లోపలి వాతావరణం చల్లబడుతుంది.