Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:33 PM
పాములు మనషులపై, ఇతర జీవులపై దాడి చేయడం మీరు చూసే ఉంటారు. అయితే రెండు విషపూరిత నాగుపాములు పరస్పరం దాడి చేసుకోవడాన్ని మీరు చూశారా? ప్రస్తుతంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ భూమి అత్యంత విషపూరిత జీవుల్లో నాగుపాము (Cobra) అగ్రస్థానంలో ఉంటుంది. నాగుపాము కాటుకు గురైతే ఎంత పెద్ద జంతువైనా క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుంది. అందుకే ఎంత పెద్ద ఏనుగైనా నాగుపాముకు దూరంగా ఉంటుంది. ఇక, మనుషులైతే పాములంటేనే భయపడతారు. పాములు మనషులపై, ఇతర జీవులపై దాడి చేయడం మీరు చూసే ఉంటారు. అయితే రెండు విషపూరిత నాగుపాములు పరస్పరం దాడి చేసుకోవడాన్ని మీరు చూశారా? (Snakes Fighting) ప్రస్తుతంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.
sarpmitra అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రెండు కింగ్ కోబ్రాస్ ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. అకస్మాత్తుగా ఆ రెండూ ఒకదానిపై మరొకటి పోరాటానికి దిగాయి. పడగ విప్పి ఒకదానినొకటి కాటు వేసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే రెండూ ఒకదానినొకటి చుట్టుకుని పట్టు విడవకుండా పోరాడాయి. చివరకు రెండూ విడిపోయి వేర్వేరు దిశల్లో వెళ్లిపోయాయి. అంత హోరాహోరీగా ఫైట్ చేసుకున్న పాములు రెండు అలా రాజీకి వచ్చి వెళ్లిపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 34 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 10 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది భార్యాభర్తల మధ్య గొడవ``, ``అత్యంత ప్రమాదకరమైన ముద్దు``, ``ఇది పోరాటం కాదు, ఇది ప్రేమ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి